×
Ad

Mahesh Babu : డ్యూయల్ రోల్ లో మహేష్.. రాముడు – శివుడు.. షర్ట్ లేకుండా.. రాజమౌళి ప్లానింగ్ గట్టిగానే ఉందిగా..

మహేష్ బాబు ఈ సినిమాలో రాముడిగా కనిపిస్తాడు అని స్వయంగా రాజమౌళినే చెప్పాడు. (Mahesh Babu)

Mahesh Babu

Mahesh Babu : రాజమౌళి – మహేష్ బాబు సినిమా వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ నిన్న రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ పాత్రల గురించి, మహేష్ లుక్స్ గురించి ఇప్పుడు చర్చగా మారింది.(Mahesh Babu)

మహేష్ బాబు ఈ సినిమాలో రాముడిగా కనిపిస్తాడు అని స్వయంగా రాజమౌళినే చెప్పాడు. రామ – రావణ యుద్ధం సీన్స్ చూపించబోతున్నట్టు గ్లింప్స్ లో కూడా హింట్ ఇచ్చారు. దీంతో మహేష్ బాబు రాముడిగా కనిపించబోతున్నట్టు క్లారిటీ వచ్చేసింది.

Also Read : Rajamouli : ఎంత మాటన్నావు రాజమౌళి.. హనుమంతుడి మీద అలా.. ఏకిపారేస్తున్న నెటిజన్లు..

ఇక మహేష్ పాత్ర పేరు రుద్ర అని పెట్టారు, వారణాసి చుట్టూ ఈ కథ తిరగనుంది. చివర్లో మహేష్ నంది మీద త్రిశూలం పట్టుకొని ఉగ్రావతారంలో వస్తున్నట్టు గ్లింప్స్ లో చూపించారు. రుద్ర, నంది, త్రిశూలం, వారణాసి, మహేష్ మెడలో లో ఉన్న లాకెట్ తో శివుడి పాత్రలో కూడా మహేష్ కనిపించబోతున్నాడని అంటున్నారు. శివుడిలా చూపించకపోయినా శివుడి రిఫరెన్స్ లు అన్ని తీసుకొని ఆయనకు ప్రతిరూపంగా చూపిస్తారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో మహేష్ షర్ట్ లెస్ గా కనిపించనున్నాడు. నిన్న మహేష్ మాట్లాడుతూ.. నేను ఏదో సింపుల్ గా బ్లూ చొక్కా వేసుకొని వద్దాం అనుకున్నాను. కానీ జక్కన్న ఒప్పుకోలేదు ఇలా సినిమా లుక్ లో రప్పించాడు. కనీసం బటన్స్ పెట్టుకుందాం అనుకున్నా వద్దు అని బటన్స్ తీయించాడు. ఇంక నయం షర్ట్ లేకుండా రమ్మనలేదు అన్నాడు.

Also Read : Rajamouli : నిజంగా మహేష్ బాబు గ్రేట్.. ఈ రోజుల్లో అసలు అలా ఉండగలరా.. రాజమౌళి వ్యాఖ్యలు వైరల్..

రాజమౌళి సినిమా లుక్స్ తో గ్రాండ్ ఎంట్రీ లు ప్లాన్ చేస్తాడు. అలా మహేష్ ని సినిమా లుక్ లో రప్పించాడు. ఈ లెక్కన సినిమాలో మహేష్ షర్ట్ లెస్ గా ఉంటాడని తెలుస్తుంది. అలాగే రాముడి పాత్ర కాబట్టి కచ్చితంగా షర్ట్ లేకుండా నే ఉంటుంది. దీంతో రాజమౌళి వారణాసి సినిమాలో మహేష్ బాబు షర్ట్ లేకుండా కనిపించబోతున్నాడు అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి సిక్స్ ప్యాక్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి.