Rajamouli : నిజంగా మహేష్ బాబు గ్రేట్.. ఈ రోజుల్లో అసలు అలా ఉండగలరా.. రాజమౌళి వ్యాఖ్యలు వైరల్..

ఈ సినిమా ఈవెంట్లో రాజమౌళి మహేష్ గురించి ఆసక్తికర విషయం తెలిపారు. (Rajamouli)

Rajamouli : నిజంగా మహేష్ బాబు గ్రేట్.. ఈ రోజుల్లో అసలు అలా ఉండగలరా.. రాజమౌళి వ్యాఖ్యలు వైరల్..

Rajamouli

Updated On : November 16, 2025 / 8:50 AM IST

Rajamouli : సినిమా స్టార్స్ వర్క్ విషయంలో, ఫుడ్, వ్యాయామం.. ఇలాంటి వాటిల్లో చాలా నిబద్ధతగా ఉంటారని తెలిసిందే. మహేష్ బాబు అయితే మరింత స్ట్రాంగ్ గా ఉంటారు. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా తింటారు మహేష్. అయితే మరో విషయంలో మహేష్ బాబు చాలా స్ట్రాంగ్ గా ఉంటారని రాజమౌళి చెప్పారు.(Rajamouli)

రాజమౌళి – మహేష్ వారణాసి సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ నిన్న రామోజీ ఫిలిం సిటీ ఘనంగా జరిగింది. ఈ సినిమా ఈవెంట్లో రాజమౌళి మహేష్ గురించి ఆసక్తికర విషయం తెలిపారు.

Also Read : Actress Jyothi : చిరంజీవిని నేను రిజెక్ట్ చేసానా.. ఆయనతో సినిమా చేసొచ్చి అద్దంలో నన్ను నేను చూసుకొని తూ అని..

రాజమౌళి మాట్లాడుతూ.. మహేష్ కష్టం గురించి తర్వాత మాట్లాడతాను. కానీ ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడతాను. ఆయన నుంచి మనం నేర్చుకునే లక్షణం ఒకటి ఉంది. మన అందరం సెల్ ఫోన్ లేకుండా ఉండలేము ఈ రోజుల్లో. కానీ మహేష్ బాబు షూటింగ్ కి వస్తే అసలు ఫోన్ చూడరు. ఫోన్ కార్ లో పెట్టేసి వస్తారు. ఏడెనిమిది గంటలు అయినా ఫోన్ జోలికి పోరు. అస్సలు ఫోన్ చూడరు. నేను కూడా మహేష్ లా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఈ విషయం కచ్చితంగా ఆయన నుంచి నేర్చుకోవాలి అని అన్నారు.

అలాగే.. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి గెటప్ లో కనపడనున్నారు. ఆయనకు రాముడిలా టెస్ట్ లుక్ చేసిన తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన రాముడి ఫోటోని నా ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నాను. కానీ ఎవరైనా చూస్తే లీక్ చేస్తారని తేసేసాను. రాముడి పాత్రలో అద్భుతంగా నటించారు అని అన్నారు రాజమౌళి. దీంతో వారణాసి సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Varanasi : రామాయణం, ట్రెజర్ హంట్, టెక్నాలజీ, శివుడు, అంటార్కిటికా, టైం ట్రావెల్.. అన్ని మిక్స్ చేసి వారణాసి.. ఏం ప్లాన్ చేసావు రాజమౌళి..