Actress Jyothi : చిరంజీవిని నేను రిజెక్ట్ చేసానా.. ఆయనతో సినిమా చేసొచ్చి అద్దంలో నన్ను నేను చూసుకొని తూ అని..

ఇంటర్వ్యూలో చిరంజీవి ప్రస్తావన రాగా తను చిరంజీవితో చేసిన సినిమా గురించి మాటాడింది. (Actress Jyothi)

Actress Jyothi : చిరంజీవిని నేను రిజెక్ట్ చేసానా.. ఆయనతో సినిమా చేసొచ్చి అద్దంలో నన్ను నేను చూసుకొని తూ అని..

Actress Jyothi

Updated On : November 16, 2025 / 8:47 AM IST

Actress Jyothi : పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. చాన్నాళ్లకు జ్యోతి మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.(Actress Jyothi)

ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి ప్రస్తావన రాగా తను చిరంజీవితో చేసిన సినిమా గురించి మాటాడింది.

Also Read : Varanasi : రామాయణం, ట్రెజర్ హంట్, టెక్నాలజీ, శివుడు, అంటార్కిటికా, టైం ట్రావెల్.. అన్ని మిక్స్ చేసి వారణాసి.. ఏం ప్లాన్ చేసావు రాజమౌళి..

జ్యోతి మాట్లాడుతూ.. చిరంజీవి గారితో అందరివాడు సినిమా చేశాను. మేనేజర్ కాల్ చేసి చిరంజీవి సినిమా ఒక్కటే సీన్ ఉంది అన్నారు. చిరంజీవి సినిమా అనగానే ఓకే చెప్పాను. అందులోనూ చిరంజీవి గారి కాంబినేషన్ ఒక్కటే సీన్ అన్నారు. సరే అని వెళ్ళా. తీరా అక్కడికి వెళ్లి చూస్తే పెళ్లి చూపులు సీన్. నేను చిరంజీవి గారిని రిజెక్ట్ చేసి ఎవరో బండోడిని లవ్ చేస్తాను అంట. ఆ సీన్ చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చేసి ఇంటికొచ్చాకా అద్దం ముందు నించొని తూ అని నన్ను నేను తిట్టుకున్నా. నేను చిరంజీవి ని రిజెక్ట్ చేసానా అనిపించింది. చిరంజీవి ని పక్కన పెట్టుకొని ఎవరో బండోడ్ని లవ్ చేయడం ఏంట్రా అనుకున్నా అని తెలిపింది.

Jyothi