Mahesh Babu: దయచేసి నువ్వు స్విచ్ ఆఫ్ చేయొద్దు.. ఎక్కడికీ వెళ్లొద్దు.. లిటిల్ హార్ట్స్ టీంపై మహేష్ ఇంటరెస్టింగ్ పోస్ట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని(Mahesh Babu) సాధించిన సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి, శివాని నాగారం జంటగా వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని సాయి మార్తాండ్ తెరకెక్కించాడు.

Mahesh Babu's special post on Little Hearts movie team

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సాధించిన సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి, శివాని నాగారం జంటగా వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని సాయి మార్తాండ్ తెరకెక్కించాడు. సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది ఈ మూవీ. ఇక సినీ స్టార్స్ సైతం ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి నేచురల్ స్టార్ నాని లాంటి స్టార్స్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) చేరారు.

Manchu Manoj: చిరంజీవి, మోహన్ బాబు కొడుకే అయ్యుండాలా.. మౌళిని చూస్తే గర్వంగా ఉంది: మంచు మనోజ్

రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ సినిమా చూసిన మహేష్ బాబు ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. “లిటిల్‌ హార్ట్స్‌.. ఆద్యంతం సరదాగా సాగేపోయే ఒక వినోదభరితమైన సినిమా. నటీనటులందరూ కొత్తవారే అయినప్పటికీ చాలా బాగా చేశారు. ఇదొక అద్భుతమైన నవ్వులు రైడ్‌. సింజిత్‌.. ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ చేసి నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్‌. ఎందుకంటే కొన్నిరోజుల్లో చాలా బిజీగా మారిపోతావ్‌” అంటూ లిటిల్ హార్ట్స్ యూనిట్ కి అభినందనలు తెలిపారు మహేష్ బాబు. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే, మహేష్ పోస్ట్ లో సింజిత్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఏంటంటే.. సింజిత్ లిటిల్ హార్ట్స్ సినిమాకు సంగీతం అందించాడు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన ఫెవరేట్ హీరో మహేష్ బాబు అని, ఆయన ఈ సినిమా చూసి పోస్ట్ పెడితే తన ఆనందానికి హద్దులు ఉండవని, అలా జరిగితే కొంతకాలం పాటు  ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికైనా వెళ్లిపోతానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అదే మాటను మెన్షన్ చేస్తూ మహేష్ బాబు పోస్ట్ పెట్టాడు. అలా సింజిత్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.