Mahesh Babu : మహేశ్ బర్త్ డే విష్… సోషల్ మీడియా షాక్
మీరు ఎంత మంచి మనసున్న వారండీ... సీతమ్మ సినిమాలో రేలంగి మావయ్య అయిపోయారు.. మీరెన్ని ట్వీట్లు చేసినా ఆయన రెస్పాండ్ కాడు..

Mahesh Puri
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఇండస్ట్రీలో అందరికీ అభిమానం. ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోకుండా.. అందరితోనూ కలిసుంటాడన్న పేరుంది. మహేశ్ బాబు వివాదాలకు దూరంగా ఉంటుంటారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటున్నారంటూ చాలామంది నిర్మాతలు, దర్శకులు చెబుతుంటారు. అందుకే క్లీన్ ఇమేజ్ ఉన్న హీరోగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
తాజాగా… మహేశ్ బాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తోంది. ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్ డే కావడంతో… హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశారు మహేశ్. Puri Jagannadh సార్… హ్యాపీ బర్త్ డే! సంతోషం, ఆరోగ్యంతో నిండిన నమ్మశక్యంకాని సంబరాల ఏడాదిని గడపండి అంటూ ట్వీట్ చేశారు మహేశ్ బాబు. పూరీ జగన్- మహేశ్ బాబు ఇద్దరూ బాగానే ఉంటున్నా… కెరీర్ లో దూసుకుపోతున్నా కూడా.. ఆ మధ్య పూరీ జగన్నాథ్ చేసిన కొన్ని పరోక్ష కామెంట్స్ ఈ ఇద్దరి అభిమానుల్లో చెదిరిపోకుండా అలాగే ఉండిపోయాయి.
Pawan-Mahesh: పవన్ స్పీచ్.. మహేష్ ట్వీట్ వైరల్!

Mahesh Puri (1)
ఇప్పటికే బ్లాక్ బస్టర్ ట్రెండ్ సెట్టింగ్ సినిమా ‘పోకిరి’, కమర్షియల్ ఫ్లిక్ ‘బిజనెస్ మేన్’ పూరీ, మహేశ్ కాంబినేషన్ లో వచ్చాయి. ఫ్యాన్స్ కు కిక్కు.. బాక్సాఫీస్ కు కాసుల వర్షం కురిపించాయి. ఆ తర్వాత… జన గణ మన అనే టైటిల్ తో అప్పట్లో పూరీ.. మహేశ్ కు ఓ కథ చెప్పారు. దీనికి మహేశ్.. ఎస్ కానీ.. నో కానీ చెప్పలేదు. ఓ ఫంక్షన్ లో మహేశ్ పై పరోక్షంగా స్పందిస్తూ పూరీ జగన్నాథ్ … కొందరు హీరోలు ఎస్ చెప్పరు.. నో చెప్పరు.. నాన్చుతారు అని అనడం… హాట్ టాపిక్ అయింది. ఐతే.. దీనిని పట్టించుకోని మహేశ్.. ప్రతి ఏడాది పూరీ జగన్నాథ్ కు బర్త్ డే విషెస్ చెబుతూనే వస్తున్నారు. ఐతే.. దీనిపై ఫ్యాన్స్ కామెంట్స్ ఇపుడు చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి.

Mahesh Puri (2)
మీరు ఎంత మంచి మనసున్న వారండీ… సీతమ్మ సినిమాలో రేలంగి మావయ్య అయిపోయారు.. మీరెన్ని ట్వీట్లు చేసినా ఆయన రెస్పాండ్ కాడు.. మీరు అజాత శత్రువు.. ఇలాంటి కామెంట్లు చేశారు అభిమానులు. గ్యాప్, ఇష్యూస్ ఉన్నా హిట్లు ఇచ్చిన దర్శకులను మరిచిపోరని… అందుకే మహేశ్ ది .. వేరే లెెవెల్ అని ట్వీటుతున్నారు అభిమానులు.