Ashok Galla : మాస్ సెంటర్స్ లో దూసుకుపోతున్న మహేష్ మేనల్లుడు.. సక్సెస్ టూర్స్ తో ప్రజల్లోకి..

మొదటి సినిమాలో లవర్ బాయ్ లా కనిపించిన అశోక్ గల్లా ఈ సినిమాలో యాక్షన్ హీరోగా బాగా పరిణితి చెందాడు.

Mahesh Nephew Ashok Galla Devaki Nandana Vasudeva Movie getting Success from B C Centers

Ashok Galla : మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ఇటీవల దేవకీ నందన వాసుదేవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కమర్షియల్ సినిమాకు డివోషనల్ టచ్ ఇచ్చి, అదిరిపోయే ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఈ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుంది. కథనం పరంగా యావరేజ్ అనిపించినా మాస్ యాక్షన్ సీన్స్ తో మాస్ బి,సి సెంటర్స్ లో ఈ సినిమా దూసుకుపోతుంది.

మొదటి సినిమాలో లవర్ బాయ్ లా కనిపించిన అశోక్ గల్లా ఈ సినిమాలో యాక్షన్ హీరోగా బాగా పరిణితి చెందాడు. కొన్ని కొన్ని సీన్స్ లో తన మామయ్య లుక్స్ కూడా కనిపించాయి. మొదటి రోజు వేరే సినిమాలు కూడా ఉండటంతో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న దేవకీ నందన వాసుదేవ సినిమా ఆ తర్వాత నుంచి మాస్ సెంటర్స్, సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరించి కలెక్షన్స్ కూడా రాబడుతుంది.

Also Read  : Allu Arjun : ‘పుష్ప 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ పై అల్లు అర్జున్ ఫోకస్..!

దీంతో ఈ సినిమాని మరింతగా ప్రేక్షకుల దగ్గరకు చేరవేసేందుకు అశోక్ గల్లా తో పాటు మూవీ యూనిట్ సక్సెస్ టూర్స్ చేస్తున్నారు. తాజాగా విజయవాడలో సక్సెస్ టూర్ చేసిన అశోక్ గల్లా తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని నగరాల్లో కూడా సక్సెస్ టూర్స్ చెయ్యబోతున్నాడు. మొత్తానికి మాస్ యాక్షన్ హీరోగా అశోక్ గల్లా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మామయ్యలా సాఫ్ట్ హీరోలాగా కాకుండా మాస్ హీరో అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అశోక్. ఈ వారం సినిమాలేవీ లేకపోవడంతో పుష్ప వచ్చేదాకా సింగిల్ స్క్రీన్స్ లో ఈ సినిమా బాగానే ఆడి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.