Mahesh Babu : ఒకే రోజు 30 మంది చిన్నారులకి ప్రాణం పోసిన మహేష్..

నమ్రత తన సోషల్ మీడియాలో.. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇవాళ మరో 30 మంది పిల్లల ప్రాణాలు కాపాడాము. ఇందుకు సహకరించిన గవర్నర్ గారికి, ఆంధ్ర హాస్పిటల్ వారికి ధన్యవాదాలు'' అని.......

Mahesh Babu : ఒకే రోజు 30 మంది చిన్నారులకి ప్రాణం పోసిన మహేష్..

Mahesh

Updated On : April 8, 2022 / 12:45 PM IST

 

Mahesh Babu :  సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ప్రేక్షకులని, అభిమానులని మెప్పిస్తునే ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకి చేరువవుతున్నారు. అంతే కాక ఎంతోమంది హృదయ సంబంధిత రోగాలతో బాధపడుతున్న చిన్న పిల్లలకి తన ఖర్చుతో హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నాడు మహేష్. తమ పిల్లల ప్రాణాలు కాపాడిన మహేష్ ని దేవుడిలా చూస్తున్నాయి ఆ కుటుంబాలు. చాలా రోజులుగా మహేష్, ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి గుండెకి సంబంధించిన రోగాలతో బాధపడే పిల్లలకు వైద్యం చేయిస్తున్నాడు. ఇప్పటికే 1000కి పైగా ప్రాణాలు కాపాడాడు మహేష్.

ఈ విషయం గురించి మహేష్ చాలా సార్లు మాట్లాడారు. ఇటీవల అన్ స్టాపబుల్ లో బాలయ్యతో కూడా ఈ సేవా కార్యక్రమం గురించి తెలియచేశాడు. మహేష్ చేసే ఈ పనిని అంతా మెచ్చుకుంటున్నారు. తాజాగా ఒకేసారి 30 మంది పిల్లల ప్రాణాలని కాపాడాడు మహేష్. నిన్న ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏకంగా 30 మంది చిన్నారుల గుండెలకి ఊపిరి పోసి వారి కుటుంబాలలో కొత్త వెలుగులు నింపారు మహేష్. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.

Allu Arjun : పార్టీ చేసుకో అంటూ.. అల్లుడిపై చిరంజీవి స్పెషల్ ట్వీట్

ఇటీవల తన సేవలని మరింత విస్తరించాలని మహేష్ బాబు ఫౌండేషన్ ప్రారంభించారు. నిన్న మహేష్ బాబు ఫౌండేషన్, ఆంద్ర హాస్పిటల్స్ తో కలిసి చిన్నారులకి ఆపరేషన్స్ చేసి వారి ప్రాణాలని కాపాడారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్‌ బిస్వ భూషణ్ హరిచందన్ ప్రత్యేకంగా హాస్పిటల్ కి వెళ్లి, ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలియచేశారు. నమ్రత తన సోషల్ మీడియాలో.. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇవాళ మరో 30 మంది పిల్లల ప్రాణాలు కాపాడాము. ఇందుకు సహకరించిన గవర్నర్ గారికి, ఆంధ్ర హాస్పిటల్ వారికి ధన్యవాదాలు” అని తెలిపారు. దీంతో మరోసారి తమ అభిమాన హీరో చేసిన ఈ గొప్ప పనికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.