×
Ad

Mahesh Vitta : వామ్మో అంత చదివి.. డబ్బుల కోసం యాక్టింగ్ కి ఓకే చెప్పి.. అతను 50 రూపాయలు ఇస్తే..

ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చాడు, ఇక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడో తెలిపాడు.(Mahesh Vitta)

Mahesh Vitta

Mahesh Vitta : యూట్యూబ్ లో ఫన్ బకెట్ అనే కామెడీ సిరీస్ తో ఫేమ్ తెచ్చుకున్న మహేష్ ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చాడు. బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయి ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్ గా నటిస్తున్నాడు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చాడు, ఇక్కడ ఎలాంటి కష్టాలు పడ్డాడో తెలిపాడు.(Mahesh Vitta)

మహేష్ విట్టా మాట్లాడుతూ.. నేను డిగ్రీ దాకా ప్రొద్దుటూరులో చదివాను. MCA హైదరాబాద్ లో కాలేజీలో చేశాను. ఆ తర్వాత ఆరు నెలలు జాబ్ కూడా చేసాను. ఇంటర్ తర్వాతే సినీ పరిశ్రమకు వస్తానని ఇంట్లో చెప్తే అక్కడ మోసం చేస్తారు, చదువుకొని వెళ్లమన్నారు. ఒక ఆరు నెలలు జాబ్ చేసి నా వల్ల కాదని డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చా. మొదట ఎక్కడైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలనుకున్నా. ఫన్ బకెట్ డైరెక్టర్ హర్షని కలిసి నేను రాసినవి ఇచ్చి వాడుకోండి పనికొస్తే, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వండి అన్నాను.

Also See : Arya Dhayal : సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న సింగర్.. పెళ్లి ఫొటోలు వైరల్..

అలా ఫన్ బకెట్ కి అసిస్టెంట్ డైరెక్టర్ చేశా. బడ్జెట్ లేవని వేరే వాళ్ళని పెట్టుకోకుండా నన్ను కూడా యాక్టింగ్ చేయించారు. అది క్లిక్ అయింది. దాంతో నన్ను యాక్టింగ్ చేయమన్నారు. నేను డైరెక్టర్ అవ్వడానికి వచ్చాను చేయను అని చెప్పాను. నిర్మాతలు అసిస్టెంట్ డైరెక్టర్ అయితే డబ్బులు ఇవ్వము, యాక్టింగ్ కి అయితే ఇస్తాము అని చెప్తే సరే అని అప్పుడు డబ్బుల కోసం యాక్టింగ్ లోకి వచ్చాను అని తెలిపాడు.

అలాగే సినీ పరిశ్రమలో ఫన్ బకెట్ డైరెక్టర్ హర్షకు థ్యాంక్స్ చెప్తూ.. నాకు ఆయన ఫుడ్ పెట్టాడు. షూటింగ్ లేనప్పుడు నాకు ఆకలేసి ఆఫీస్ కి వెళ్ళేవాడిని. పైకి కిందకి తిరుగుతుంటే హర్ష అన్న చూసి 50 రూపాయలు ఇచ్చి వెళ్లి తినమనేవాడు. అతని బైక్ ఇచ్చాడు. సిట్టింగ్ వేద్దామంటే చెప్పు అని వచ్చాడు. ఒక ఆరు నెలలు నేను ఎంతో కొంత సంపాదించేదాకా నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు హర్ష అన్న. అందుకే ఇండస్ట్రీలో ఆయనకు మాత్రం థ్యాంక్స్ చెప్పాలి అని అన్నాడు.

Also See : 80s Stars Reunion : 80s రీ యూనియన్ స్పెషల్ ఫొటోలు.. మెగాస్టార్, వెంకీమామ, మీనా, రమ్యకృష్ణతో సహా 31 మంది స్టార్స్..