టాలివుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ సమంతా, నాగచైతన్య ఇప్పుడు ఆడియన్స్ ని తెగ ఊరిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత మరోసారి కలిసి నటిస్తూ.. ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ ని పెంచేస్తున్నారు. రిలీజ్ కి ముందే మంచి పాజిటివ్ టాక్ ని సంపాదించుకున్న మజిలీ మూవీపై.. ట్రైలర్ రలీజయ్యాక ఎక్స్ పెక్టేషన్స్ ఇంకాస్త పెరిగిపోయాయి. పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ సమంతా, చైతూ కలిసి నటిస్తోన్న మజిలీ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మజిలీ టీజర్ రిలీజైనప్పటి నుంచి సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఆ తర్వాత గోపిసుందర్ కంపోజ్ చేసిన పాటలు రిలీజయ్యాక ఆడియన్స్ ఇంకాస్త అట్రాక్ట్ అయ్యారు. ముఖ్యంగా మజిలీ మూవీలోని ప్రియతమా సాంగ్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన మజిలీ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి.
మజిలీ ట్రైలర్ ని బట్టి చూస్తే ప్రేమలో ఓడిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఓ అబ్బాయి. ఆ అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక తప్పుదోవ పట్టిన భర్తని.. తన ప్రేమతో మార్చాలనుకునే ఓ భార్య ప్రయత్నమే మజిలీ. భర్తని, భార్య ఎంతలా ప్రేమిస్తుందో ఆ అనురాగం ఎలా ఉంటుందో డైరెక్టర్ శివ నిర్వాణ మంచి ఎమోషన్ తో చూపించినట్లు తెలుస్తోంది. అందుకే మజిలీ మంచి ఫీల్ ఉన్న సినిమా అనే టాక్ ని సంపాదించుకుంది.
అంతేకాదు.. సమంతా క్యారెక్టర్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్ లో సమంతా యాక్టింగ్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా మజిలీ దూసుకుపోతుంది. మజిలీ శాటిలైట్ రైట్స్ 5 కోట్లు పలికాయి. డిజిటల్ రైట్స్ కి మూడున్నర కోట్లు, హిందీ డబ్బింగ్ రైట్స్ కి మరో నాలుగు కోట్లు కలిసి మొత్తం 12 కోట్లకిపైగా బిజినెస్ చేసింది. మరి వరుస ప్లాపులతో డీలాపడిపోయిన నాగచైతన్య.. ఈ సినిమాతోనైనా గాడిలో పడతాడో లేదో చూడాలి.