Major: మేజర్ 3 రోజుల వసూళ్లు.. ఎంతంటే?

ముంబై దాడుల్లో అమరుడైన వీరజవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.....

Major 3 Days Worldwide Collections

Major: ముంబై దాడుల్లో అమరుడైన వీరజవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మేజర్ సందీప్ పాత్రలో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరిచారు. ఇక ఈ సినిమాను దర్శకుడు శశికిరణ్ తిక్కా తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది.

Major Movie : అల్లు అర్జున్ కి థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఎందుకో తెలుసా??

ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుని వసూళ్ల పరంగా కూడా సాలిడ్ రన్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాకు తెలుగునాటతో పాటు బాలీవుడ్, మలయాళ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగా వస్తుండటంతో ఈ సినిమా అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో అడివి శేష్ సరసన బాలీవుడ్ భామ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా, శోభిత ధూళిపాల ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించింది.

Major: మేజర్ టీమ్‌కు హ్యాట్సాఫ్..!

మేజర్ చిత్రం ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.19.35 కోట్ల షేర్ వసూళ్లు సాధించినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక గ్రాస్ పరంగా ఈ చిత్రం రూ.35.80 కోట్లు కలెక్ట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద మేజర్ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని.. వారందరికీ చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలియజేసింది. ఇక మేజర్ మూడు రోజుల వసూళ్ల వివరాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 5.01 కోట్లు
సీడెడ్ – 1.28 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.42 కోట్లు
ఈస్ట్ – 0.95 కోట్లు
వెస్ట్ – 0.63 కోట్లు
గుంటూరు – 0.75 కోట్లు
కృష్ణా – 0.71 కోట్లు
నెల్లూరు – 0.50 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 11.25 కోట్లు (రూ.18.80 కోట్లు గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 1.25 కోట్లు
హిందీ + ఇతర భాషలు – 2.15 కోట్లు
ఓవర్సీస్ – 4.70 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.19.35 కోట్లు (రూ.35.80 కోట్లు గ్రాస్)