Indian 2: ఇండియన్-2లో ఎవర్ చార్మింగ్ హీరో.. కన్ఫం చేసిన మేకర్స్!

కమల్ హాసన్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఇండియన్-2లో మరో హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా కన్ఫం చేసింది.

Makers Confirm Of Siddharth In Indian 2 Movie

Indian 2: తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఇండియన్-2’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరో కమల్ హాసన్ వైవిధ్యమైన పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా ఉన్నారు. గతంలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఇది సీక్వెల్ మూవీ కావడంతో, సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఈ సినిమాపై అదిరిపోయే క్రేజ్ నెలకొంది.

Indian 2 : దేశాలు తిరిగేస్తున్న లోకనాయకుడు.. తైవాన్ లో ఇండియన్ 2 షూటింగ్..

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ సినిమాలో మరో హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సిద్ధార్థ్ నటిస్తున్నాడు. ఈమేరకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్‌తో అనౌన్స్ చేసింది. ఎవర్ చార్మింగ్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సిద్ధార్థ్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Indian 2: సౌతాఫ్రికా వెళ్తున్న ఇండియన్.. ట్రైన్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేసిన శంకర్!

ఇండియన్-2 సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మరో బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తారు.