Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. పెద్ది వాయిదా పడుతుందా? కారణం ఏంటంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా పెద్ది(Peddi). ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
Ram Charan 'Peddi' movie postponed to 2026 summer
Peddi; మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే పెద్దిపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. ఎన్నడూ లేని విదంగా పెద్ది సినిమా గురించి ఓపెన్ కామెంట్స్ చేస్తున్నాడు. దీంతో, మెగా ఫ్యాన్స్ కూడా పెద్ది(Peddi) సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ అవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక పెద్ది సినిమా రిలీజ్ విషయంలో కూడా మేకర్స్ ముందు నుంచి పక్కా ప్లానింగ్ లో ఉన్నారు. అనుకున్నట్టుగానే ఎలాంటి అవాంతరాలు లేకుండా షూటింగ్ సాగుతోంది. అనుకున్నట్టుగానే ఈ సినిమా 2026 మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ, తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ మేరకు పెద్ది సినిమా వాయిదా పడనుందని తెలుస్తోంది. దానికి, కారణం పెద్ది సినిమా కోసం మేకర్స్ సోలో రిలీజ్ కోసం చూస్తున్నారు. కానీ, మార్చ్ ఎండింగ్ లో చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అందుకే ఈ సినిమాను వాయిదా వేయాలని చూస్తున్నారట మేకర్స్.
అయితే, సోషల్ మీడియాలోవైరల్ అవుతున్న ఈ న్యూస్ కేవలం రూమర్స్ అని తెలుస్తోంది. మేకర్స్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కాబట్టి, ఫ్యాన్స్ ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఇక, పెద్ది సినిమాను మార్చ్ 27న పక్కాగా విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యాడట దర్శకుడు బుచ్చిబాబు. తాను ప్లాన్ చేసుకున్నట్టుగానే అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి కల్లాకంప్లేట్ చేస్తున్నాడట. కాబట్టి, సినిమా వాయిదా పడటం అనేది అసంభవం. ఇక పెద్ది సినిమా నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్ కూడా త్వరలోనే రానుంది. చికిరి సాంగ్ కి మించి ఈ పాట ఉంటుందని ఇండస్ట్రీ నుంచి వస్తున్న టాక్.
