Akhanda 2: తెలంగాణాలో అఖండ 2 టికెట్ హైక్స్ రద్దు.. జీవో కొట్టేసిన హైకోర్టు.. మరి బుక్ చేసుకున్నవాళ్ళ పరిస్థితి ఏంటి?

అఖండ 2(Akhanda 2) మేకర్స్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే, చెన్నై కోర్ట్ ఇచ్చిన తీర్పు వల్ల విడుదల వాయిదా పడగా.. తాజాగా ఈ సినిమాపై మరో సంచలన తీర్పు వెలువడింది.

Akhanda 2: తెలంగాణాలో అఖండ 2 టికెట్ హైక్స్ రద్దు.. జీవో కొట్టేసిన హైకోర్టు.. మరి బుక్ చేసుకున్నవాళ్ళ పరిస్థితి ఏంటి?

Telangana High Court has cancelled Akhanda 2 ticket hike go

Updated On : December 11, 2025 / 3:33 PM IST

Akhanda 2: అఖండ 2 మేకర్స్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే, చెన్నై కోర్ట్ ఇచ్చిన తీర్పు వల్ల విడుదల వాయిదా పడగా.. తాజాగా ఈ సినిమాపై మరో సంచలన తీర్పు వెలువడింది. తెలంగాణాలో అఖండ 2 మూవీ టికెట్స్ హైక్స్ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టు కొట్టి వేసింది. ధరలు పెంచుకునే అవకాశాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అలాగే ప్రీమియర్ షోస్ కూడా క్యాన్సిల్ చేసింది. దీంతో, అఖండ 2(Akhanda 2) సినిమా డిసెంబర్ 12 నుంచి నార్మల్ టికెట్ ధరలతో విడుదల కానుంది.

Annagaru Vostharu Postponed: అన్నగారు వస్తారు మూవీ వాయిదా.. అధికారిక ప్రకటన చేసిన మేకర్స్.

అయితే, తెలంగాణలో అఖండ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. అది కూడా పెరిగిన టికెట్ ధరలకు అనుగుణంగా. మరి ఇప్పుడు ధరలు ఆ జీవోని కోర్టు కొట్టేసింది కాబట్టి, నార్మల్ టికెట్ ధరలే అందుబాటులో ఉంటాయి. మరి ఎక్కువ ధర పెట్టి కొన్న ఆడియన్స్ కి వాళ్ళ మనీ రైటర్స్ ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ న్యూస్ తెలిసాకా చాలా మంది ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా మంది మా డబ్బులు ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం గురించి అఖండ 2 మేకర్స్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందా అనేది చూడాలి. మొత్తానికి, అఖండ 2 విషయంలో వివాదాలు మాత్రం ఆగడం లేదు.