Annagaru Vostharu Postponed: అన్నగారు వస్తారు మూవీ వాయిదా.. అధికారిక ప్రకటన చేసిన మేకర్స్.

తమిళ స్టార్ కార్తీ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ వా వాతియార్. ఇదే సినిమాను తెలుగులో అన్నగారు వస్తారు(Annagaru Vostharu Postponed) అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.

Annagaru Vostharu Postponed: అన్నగారు వస్తారు మూవీ వాయిదా.. అధికారిక ప్రకటన చేసిన మేకర్స్.

Hero Karthi Anna Garu Vastharu movie postponed.

Updated On : December 11, 2025 / 2:22 PM IST

Annagaru Vostharu Postponed: తమిళ స్టార్ కార్తీ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ వా వాతియార్. ఇదే సినిమాను తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ముందు చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కావలి. కానీ, ఇండస్ట్రీలో జరిగిన తాజా పరిణామాల ప్రకారం ఈ సినిమాను వాయిదా(Annagaru Vostharu Postponed) వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈమేరకు నిర్మాత సంస్థ స్టూడియో గ్రీన్ అధికారిక ప్రకటన చేసింది. అయితే, కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. దీంతో, కార్తీ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నాయి.

Akhanda 2: అఖండ2 మేకర్స్ కి మరో షాక్.. టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్

అయితే, అన్నగారు వస్తారు సినిమా విడుదలకు కారణం అఖండ 2 అనే వాదనలు వినిపిస్తున్నాయి. ముందు చెప్పిన ప్రకారం అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కావాలి. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆగిపోయింది. దీంతో, ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే, అఖండ 2పై జనాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో,డిసెంబర్ 12న విడుదలకు సిద్దమైన చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఇప్పుడు అన్నగారు వస్తారు సినిమా కూడా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.

ఇక అన్నగారు వస్తారు సినిమాను దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కిస్తున్నాడు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సరికొత్త కథ, కథనంతో రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అలాగే, హీరో కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఒక రేంజ్ ప్రమోషన్స్ చేశారు మేకర్స్. ఇక రేపే విడుదల అవుతుంది అనుకుంటున్న నేపధ్యంలో ఇలా అనుకోకుండా వాయిదా పడటం అభిమానులను నిరాశపరిచింది. దీంతో, సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి మారిన కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ఎప్పుడు ప్రాకటిస్తారు అనేది చూడాలి.