Akhanda 2: అఖండ2 మేకర్స్ కి మరో షాక్.. టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్
విడుదల వేల అఖండ 2(Akhanda 2) మూవీ మేకర్స్ కి మరో షాక్ తగిలింది. అఖండ2 టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు అయ్యింది.
lunch motion petition filed in Telangana High Court regarding Akhanda 2 ticket price hike
Akhanda 2: అఖండ 2(Akhanda 2) మేకర్స్ కి మరో షాక్ తగిలింది. ఈ సినిమా టికెట్ల ధర పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు అయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలంటూ లంచ్ మోషన్ వేశారు న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి. ఇక న్యాయస్థానం సైతం ఈ లంచ్ మోషన్ కి అనుమతించింది. ఆలాగే టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై విచారణ చేయనుంది. దీంతో ఇప్పుడు మరోసారి అఖండ 2 సినిమా హాట్ టాపిక్ అయింది. మరి ఈ విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Annagaru Vostharu Postponed: అన్నగారు వస్తారు మూవీ వాయిదా.. అధికారిక ప్రకటన చేసిన మేకర్స్.
ఇప్పటికే అఖండ 2 సినిమా వాయిదా పడిన విషయం తెలిసిదే. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమాపై స్టే విధిస్తూ తీర్పు ఇచ్చింది చెన్నై హై కోర్ట్. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తమకు 14 రీల్స్ సంస్థ నుంచి కొంత అమౌంట్ రావాల్సి ఉందని. అది క్లియర్ అయ్యేవరకు సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ పిటీషన్ దాఖలు చేసింది. అయితే, దీనిపై సుదీర్ఘమైన మంతనాలు జరుగగా ఎట్టకేలకు దిగివచ్చిన ఈరోస్ సంస్థ అఖండ 2 విడుదలకు అనుమతిని ఇచ్చింది.
అయితే, వివాదం సద్దుమణిగింది ఇక విడుదల అవడమే ఆలస్యం అనుకునే వేల ఇప్పుడు మరో సమస్య ఎదురయ్యింది. తాజాగా అఖండ 2 సినిమాకు టికెట్ హైక్స్ కి అనుమతివ్వడం పై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి లుక్ మోషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హై కోర్ట్ విచారణ చేపట్టనుంది. మరి ఈ విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
