Srimanthudu
Srimanthudu : మహేష్ బాబు-కొరటాల శివ కాంబోలో 2015 లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ కథ తనదంటూ రైటర్ శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారు. అప్పటినుండి ఈ వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా శరత్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంలో శ్రీమంతుడు సినిమా మేకర్స్ స్పందించారు.
Poonam Pandey : బాలీవుడ్ సంచలన నటి పూనమ్ పాండే కన్నుమూత
2015 లో రిలీజైన ‘శ్రీమంతుడు’ సినిమా బాగానే వసూళ్లు రాబట్టింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తన నవల ‘చచ్చేత ప్రేమ’ ను కాపీ చేసి తీశారని అప్పట్లో రచయిత శరత్ చంద్ర ఆరోపించారు. నాంపల్లి హైకోర్టును ఆశ్రయించారు. కొరటాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు తీర్పు ఇవ్వడంతో కొరటాల తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ అనుకూలంగా తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్ధానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాలని సుప్రీం సైతం క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల రచయిత శరత్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో కొరటాల ఆ స్క్రిప్ట్ తనదిగా అంగీకరించాలని కోరారు. దాంతో వివాదం మరోసారి వేడెక్కింది. దీనిపై సినీ పెద్దలు ఎవరు కలగజేసుకున్నా గొడవ సద్దుమణగలేదు.
HanuMan Collections : 92ఏళ్ళ సినీ చరిత్రలో ‘హనుమాన్’ సరికొత్త సంచలనం..
ఈ నేపథ్యంలోనే శ్రీమంతుడు సినిమా టీమ్ స్పందించింది. ‘శ్రీమంతుడు సినిమా, చచ్చేంత ప్రేమ నవల రెండు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయి. రెండు వేటికవే భిన్నమైనవి. పుస్తకం, సినిమాను పరిశీలించే వారు ఈ వాస్తవాన్ని తక్షణమే ధృవీకరించవచ్చు. ఈ విషయం ప్రస్తుతం న్యాయ సమీక్షలో ఉంది. ఈ రోజు వరకు ఎటువంటి విచారణలు, తీర్పులు రాలేదు. అందువల్ల అప్పుడే ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీమంతుడు కథపై సదరు రచయిత చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి. ఆ విషయం పై కోర్టు గాని, రచయితల సంఘము గాని ఎటువంటి తీర్పు ఇవ్వలేదనే వాస్తవం అందరు గ్రహించాలి. కోర్టు పరిధిలో వున్న అంశంపై అసత్య ప్రచారాలు చేస్తున్న ఎవరిమీదైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. దయచేసి ఆధారం లేని ఆరోపణలని ప్రచారం చేయొద్దని మీడియా వారిని కోరుతున్నాము’..అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇక ఈ వివాదం ఎప్పటికి సద్దుమణుగుతుందో చూడాలి.
— Mythri Movie Makers (@MythriOfficial) February 2, 2024