HanuMan Collections : 92ఏళ్ళ సినీ చరిత్రలో ‘హనుమాన్’ సరికొత్త సంచలనం..

92ఏళ్ళ సినీ చరిత్రలో 'హనుమాన్' మూవీ సరికొత్త సంచలనం సృష్టించింది. అదేంటంటే సంక్రాంతికి రిలీజయ్యిన ఈ చిత్రం..

HanuMan Collections : 92ఏళ్ళ సినీ చరిత్రలో ‘హనుమాన్’ సరికొత్త సంచలనం..

Teja Sajja Prashanth Varma Hanuman Movie creates new record in 92 years of telugu cinema

Updated On : February 2, 2024 / 12:18 PM IST

HanuMan Collections : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా కనిపిస్తూ.. ఈ సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ సినిమా భారీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా రిలీజయ్యి మూడు వారలు అవుతుంది. ఈ మధ్యలో కొన్ని సినిమాలు కూడా రిలీజయ్యాయి. అయినాసరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా జోష్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ మూవీ.. 92ఏళ్ళ సినీ చరిత్రలో సరికొత్త సంచలనం సృష్టించింది.

అదేంటంటే.. సంక్రాంతికి రిలీజయ్యిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.278 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసి అదుర్స్ అనిపిస్తుంది. అయితే ఇందులో ఏం సంచలనం ఉందని అనుకుంటున్నారా..? ఈ సినిమా సంచలనం సృష్టించింది.. సంక్రాంతి విడుదల సినిమాల లిస్టులో. 92ఏళ్ళ సినీ చరిత్రలో.. ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ సంక్రాంతికి వచ్చాయి. ఆ చిత్రాలు అన్నిటిని హనుమాన్ బీట్ చేసింది.

Also read : Raviteja : 70ఏళ్ళ బామ్మల విషయంలో.. రవితేజ చేసిన పని అందర్నీ ఆకట్టుకుంటుంది..

మొన్నటివరకు ఈ రికార్డు అల్లు అర్జున్ పేరు మీద ఉండేది. 2020 సంక్రాంతికి వచ్చిన ‘అలవైకుంఠపురములో’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 260 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని హనుమాన్ మూవీ క్రాస్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హనుమాన్ మూవీ టీం.. ’92ఏళ్ళ సినీ చరిత్రలో ఆల్ టైం సంక్రాంతి బ్లాక్ బస్టర్’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఒక చిన్న సినిమాగా మొదలయ్యి, రిలీజ్ కావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, నేడు ఇంతటి సంచలనం సృష్టించడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. కేవలం ఈ రికార్డు మాత్రం కాదు, అమెరికన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సంచలనాలు సృష్టిస్తుంది. అక్కడ ఉన్న అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ రికార్డులను ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. మరి రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.