‘అధీరా’ పరిస్థితి అగమ్యగోచరం.. కన్ఫ్యూజన్‌లో కె.జి.యఫ్ 2 మేకర్స్..

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ హెల్త్ ఇష్యూస్‌తో ఇబ్బందిపడుతున్నారు. మొన్నీమధ్య బ్రీతింగ్ ప్రాబ్లమ్‌తో హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు కరోనా అన్నారు. కాదని తేలిన తర్వాత.. లంగ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో ఉంది.. ఇక లేట్ చేస్తే ప్రమాదమే అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సంజయ్ దత్ పరిస్థితి ఏంటి..? సంజయ్ నటిస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి..?
సంజయ్ దత్ జీవితంలో చిన్నప్పటినుంచి ఏదోక ఇష్యూతో ఫైట్ చేస్తూనే ఉన్నారు. పర్సనల్ ఇష్యూస్, ఫ్యామిలీ, జైలు ఇలా.. ఏదో ఒక ప్రాబ్లంతో త్రూ అవుట్ ద లైఫ్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ మధ్యనే వీటన్నింటికీ కాస్త బ్రేక్ వచ్చి మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. అంతలోపే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్‌తో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు సంజయ్.
శ్వాసకోస ఇబ్బందులు అంటే అందరూ ఈ సీనియర్ హీరోకి కరోనా అనుకున్నారు కానీ.. కరోనా కాదు .. లంగ్ క్యాన్సర్ అని తేలింది. అది కూడా థర్డ్ స్టేజ్‌లో ఉందని, వెంటనే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చెయ్యాలని సజెస్ట్ చెయ్యడంతో వెంటనే ట్రీట్‌మెంట్ కోసం అమెరికా బయల్దేరారు సంజయ్. అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేప్పుడు నార్మల్‌గా నడుచుకుంటూ అందరికీ హాయ్ చెబుతూ బయటికి వచ్చారు. సంజయ్. దాంతో సంజూ బానే ఉన్నాడని, అంత సీరియస్ కండిషన్ కాదని కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్ .
సంజూతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా, కంగారు పడకండి..సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి..సంజయ్ దత్ బాగానే ఉన్నారని చెప్పారు. ట్రీట్‌మెంట్ చేయించుకుని త్వరలోనే వస్తాను అని సంజయ్ సోషల్ మీడియాలో మెసేజ్ పోస్ట్ చేశారు. సంజయ్ హెల్త్ గురించి సినిమా ఇండస్ట్రీ కూడా కంగారు పడుతోంది. ఆల్రెడీ సంజూతో సినిమాలు కమిట్ అయిన వాళ్లు తెగ వర్రీ అవుతున్నారు. నిజానికి ఇవేం జరగకపోతే ..ఇంకో మూడు రోజుల్లో ‘కె.జి.యఫ్ 2’ కు సంబంధించి సంజయ్ దత్ షూటింగ్ స్టార్ట్ చేసి ఉండేవారు.
కె.జి.యఫ్ 2 తో పాటు మహేష్ భట్ డైరెక్షన్లో ఆదిత్యరాయ్ కపూర్, ఆలియా జంటగా సంజయ్ దత్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ‘సడక్ 2’ ఈ నెలలోనే ఓటీటీలో రిలీజ్ అవుతోంది. మరో మూవీ ‘భుజ్-ది ఇండియన్ ప్రైడ్’ మూవీ కూడా ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలతో పాటు సంజయ్ దత్, నర్గీస్ ఫక్రీ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ బేస్డ్ మూవీ.. ‘టోర్ బాజ్’ కూడా ఓటీటీలోనే రిలీజ్‌కు సిద్దమౌతోంది. 60 క్రాస్ చేసిన సంజూ… ఈ సినిమాలతో పాటు ఇంకా మరిన్ని మంచి సినిమాలు చేసి ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చెయ్యాలని, త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్స్‌లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్ .