అక్కడ మక్కల్ సెల్వన్ – ఇక్కడ మనకు విలన్

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి 2020వ సంవత్సరంలో విలన్‌‌గా బిజీ కానున్నాడు.. తెలుగులో వరుసగా సినిమాలు చేయనున్నాడు..

  • Published By: sekhar ,Published On : November 26, 2019 / 09:56 AM IST
అక్కడ మక్కల్ సెల్వన్ – ఇక్కడ మనకు విలన్

Updated On : November 26, 2019 / 9:56 AM IST

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి 2020వ సంవత్సరంలో విలన్‌‌గా బిజీ కానున్నాడు.. తెలుగులో వరుసగా సినిమాలు చేయనున్నాడు..

కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో సమానంగా కొంతమంది యాక్టర్స్ మంచి క్రేజ్ అందుకుంటున్నారు. అందులో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఒకరు. హీరోగా సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూ ఆయా సినిమాలకు మంచి బూస్టప్ ఇస్తున్నాడు. ఇటీవల ‘సైరా’ సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇకపోతే 2020వ సంవత్సరంలో విజయ్ విలన్‌‌గా బిజీ కానున్నాడు..


మొత్తంగా నాలుగు సినిమాల్లో ఈ టాలెంటెడ్ హీరో డార్క్ షేడ్స్ ఉన్నపాత్రలతో తెరపై కనిపించనున్నాడు. లోకేష్ కనకరాజ్ (ఖైదీ ఫేమ్) దర్శకత్వంలో దళపతి విజయ్ 64వ ప్రాజెక్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ సినిమాతో పాటు విశ్వనాయకుడు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’లో కూడా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు వచ్చాయి కానీ, తాను ఆ సినిమా చేయట్లేదని క్లారిటీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. దళపతి విజయ్ 64వ సినిమా 2020 సమ్మర్‌లో రిలీజ్ కానుంది..

Makkal Selvan vijay sethupathi vision 2020

ఇక తెలుగులో ‘ఉప్పెన’ సినిమాలో విలన్‌గా టాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు. అలాగే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో కూడా విజయ్ సేతుపతి ఒక డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. మొత్తానికి తమిళనాట స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతి తెలుగునాట ప్రతినాయకుడిగా బిజీ అవనున్నాడు..