విజయ్‌కి విలన్‌గా విజయ్ సేతుపతి

దళపతి 64లో విజయ్‌కి విలన్‌గా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించనున్నాడే విషయాన్ని మూవీ టీమ్ కన్ఫమ్ చేసింది..

  • Publish Date - October 1, 2019 / 10:03 AM IST

దళపతి 64లో విజయ్‌కి విలన్‌గా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించనున్నాడే విషయాన్ని మూవీ టీమ్ కన్ఫమ్ చేసింది..

‘దళపతి’ విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘బిగిల్’ సినిమా చేస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ స్పోర్ట్స్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ‘బిగిల్’ తర్వాత ‘మా నగరం’.. తెలుగులో (నగరం) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చెయ్యనున్నాడు విజయ్. ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తుంది. విజయ్ నటిస్తున్న 64వ సినిమా ఇది.

ఈ మూవీలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడని గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ కన్ఫమ్ చేసింది. దళపతి 64లో విజయ్ సేతుపతి నటించనున్నాడని ప్రకటించారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే, క్యారెక్టర్ నచ్చితే ఇతర సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి ఈ మూవీలో నటిస్తున్నాడు అనగానే అంచనాలు పెరిగిపోయాయి.

Red Also : నందమూరి తారకరత్న – ‘దుర్గ’..

అక్టోబర్‌లో షూటింగ్ స్టార్ట్  చేసి, 2020 సమ్మర్‌లో విడుదల చెయ్యనున్నారు. అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చెయ్యనుండగా.. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ప్రస్తుతం విజయ్ ‘బిగిల్’, లోకేష్ కనకరాజ్.. కార్తి ‘ఖైదీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు తమిళనాట దీపావళికి విడుదల కానున్నాయి.