మలైకా బర్త్‌డే పార్టీ : అర్జున్ కపూర్‌తో కలిసి రచ్చ రచ్చ!

23న తన 46వ బర్త్‌డే సందర్భంగా మలైకా గత రాత్రి బాంబేలో బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చింది.. పార్టీలో అర్జున్ కపూర్, మలైకా అరోరాల డ్యాన్స్ స్టెప్స్ హైలెట్‌గా నిలిచాయి..

  • Publish Date - October 23, 2019 / 09:44 AM IST

23న తన 46వ బర్త్‌డే సందర్భంగా మలైకా గత రాత్రి బాంబేలో బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చింది.. పార్టీలో అర్జున్ కపూర్, మలైకా అరోరాల డ్యాన్స్ స్టెప్స్ హైలెట్‌గా నిలిచాయి..

అర్జున్ కపూర్, మలైకా అరోరాల డేటింగ్ వ్యవహారం బయటకొచ్చినప్పటి నుంచి మీడియాకి, జనాలకు వాళ్ల రిలేషన్‌పై తెలియని ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దానికి కారణం మలైకా, అర్జున్ మధ్య వయసు తేడా అనేది తెలిసిందే. ఇక వీళ్లిద్దరూ బయట కలిసి కనిపిస్తే చాలు కెమెరాలు క్లిక్‌మనిపిస్తుంటారు.. రీసెంట్‌గా మరోసారి వార్తల్లో నిలిచిందీ జంట..

23న తన 46వ బర్త్‌డే సందర్భంగా మలైకా గత రాత్రి బాంబేలో బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చింది. హాట్‌ సిల్వర్‌ ఔట్‌ఫిట్స్‌ ధరించి మలైకా అదరగొట్టింది. అంతేకాదు ఈ పార్టీలో ఆమె వేసిన స్టెప్పులు అయితే హైలెట్‌ అనే చెప్పాలి. ఆమె ప్రియుడు అర్జున్‌ కూడా ఈ పార్టీలో తన స్టెప్పులతో రెచ్చిపోయాడు.

Read Also : ‘డార్లింగ్’కి సెలబ్రిటీల బర్త్‌డే విషెస్

పార్టీలో ఈ ఇద్దరు చేసిన డ్యాన్సుల వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. కరిష్మా కపూర్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా, శిల్పా శెట్టి, తారా సుతారియా, శ్వేతా నందన్ బచ్చన్, జాన్వీ కపూర్ అర్జున్ రాంపాల్, రాజ్ కుమార్ రావు తదితరులు ఈ పార్టీలో సందడి చేశారు.

ట్రెండింగ్ వార్తలు