Malavika Mohanan interesting comments about Sandeep Reddy Vanga Heroines
Malavika Mohanan: మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నాడు. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
చాలా కాలం తరువాత ప్రభాస్ వింటేజ్ లుక్స్ లో కనిపించడం, హీరోయిన్స్ తో రోమాన్స్ చేయడం, కామెడీ, డాన్స్ చేయడం వంటివి ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఈ సినిమా విడుదల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Thanuja Puttaswamy: బంతిపువ్వు రంగు చీరలో పూబంతిలా.. తనూజ లేటెస్ట్ ఫొటోస్
దీంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan) సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి స్పెషల్ గా చెప్పుకొచ్చింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘సందీప్ రెడ్డి వంగా తన హీరోయిన్స్ ని చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు.
దాంతో, వారికి ఒక కొత్త హైప్ క్రియేట్ అవుతుంది. కబీర్ సింగ్ తో కియారా అద్వానీకి అలాంటి క్రేజ్ వచ్చింది. యానిమల్ తో తృప్తి డిమ్రి కి కూడా అలాంటి ఒక హిప్ క్రియేట్ అయ్యింది. స్పిరిట్ తో అది కంటిన్యూ అవుతోంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇన్ డైరెక్టర్ గా తనకు కూడా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించాలని ఉంది అనే కోరికను ఇలా బయటపెట్టింది. చూడాలి, మరి ఈ కామెంట్స్ తో కనీసం తన నెక్స్ట్ సినిమాలో అయినా మాళవిక మోహనన్ ను హీరోయిన్ గా తీసుకుంటాడా సందీప్ అనేది చూడాలి.