Malavika Mohanan's interesting comments on her next films
Malavika Mohanan: మాళవిక మోహనన్.. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన పట్టంపోలే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో పేటలో నటిచింది. ఈ రెండు సినిమాలు ఆమె కెరీర్ కి పెద్దగా ఉపయోగపడలేదు కానీ, ఆ తరువాత తమిళ స్టార్ విజయ్ తో చేసిన మాస్టర్ ఆమె కెరీర్ ను మలుపుతిప్పింది. దర్శకుడు లోకేష్ కానగరాజ్ తెరెకక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక అక్కడి నుంచి ఈ అమ్మడు కెరీర్ ఊపందుకుంది. వరుస అవకాశాలు దక్కించుకుంది. అయితే, ఒకప్పుడు పెద్ద సినిమాలు, స్టార్ హీరోలు అంటూ పరిగెత్తిన మాళవిక ఇప్పుడు మాత్రం కేవలం మంచి పత్రాలు ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటుందట. ఈ విషయంపై తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది మాళవిక(Malavika Mohanan).
Mahavatar Narsimha: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మహావతార్ నరసింహా.. స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు పెద్ద హీరోలతో, స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలని అనుకుంటారు. నేను అలాగే అనుకున్నాను. కానీ, తరువాత కాలానుగుణంగా ఆ ఆలోచనలో మార్పు వచ్చింది. ఇప్పుడు మాత్రం కేవలం ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే బలమైన పాత్రలు మాత్రమే చేయాలని అనుకుంటున్నాను. పెద్ద సినిమాల్లో అవకాశం రావడం మంచిదే కానీ, సినిమాలో మన పాత్ర బలంగా లేకపోతే ప్రేక్షకులు గుర్తు పెట్టుకోరు. అందుకే, ఆలస్యమైనా శక్తిమంతమైన కథల్లో నటించి, మనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకోవాలి. ప్రస్తుతం అలాంటి ప్రయత్నంలోనే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
ఇక మాళవిక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె కార్తీ సరసన సర్దార్ 2 సినిమాలో నటిస్తోంది. బ్లాక్ బస్టర్ సర్దార్ కుక్ సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మాళవిక నటిస్తున్న మరో భారీ సినిమా రాజాసాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ కామెడీ అండ్ హారర్ మూవీని దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే, అమ్మడు వరుస అవకాశాలు దక్కించుకోవడం ఖాయం.