‘ప్రేమలు’ మూవీ రివ్యూ.. సింగిల్ బాయ్స్ కచ్చితంగా చూడాల్సిందే..

మలయాళంలో సూపర్ హిట్ ‘ప్రేమలు’ నేడు తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ మూవీ ఎలా ఉంది..?

Malayala Block Buster Love Story Premalu Movie review and rating

Premalu Review : ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ సినిమాని తెలుగులోకి.. రాజమౌళి తనయుడు కార్తికేయ తీసుకు తీసుకు వచ్చారు. నస్లెన్ గఫూర్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ మూవీని నేడు రిలీజ్ చేసారు. ట్రైలర్ తో యూత్ ని బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం థియేటర్ లో ఎలా మెప్పించింది.

కథ విషయానికొస్తే.. కేరళకు చెందిన సచిన్ (నస్లెన్ గఫూర్) తమిళనాడులోని ఒక కాలేజీలో చదివి బయటకు వస్తాడు. యూకే వెళ్లిపోవాలని అనుకుంటాడు కానీ వీసా రిజెక్ట్ అవడంతో ఓ ఫ్రెండ్ సలహాతో హైదరాబాదులో గేట్ కోచింగ్ జాయిన్ అవుతాడు. మరోవైపు రేణు (మమిత బైజు) కేరళ నుంచి జాబ్ చేయడం కోసం హైదరాబాద్ వస్తుంది. అనుకోకుండా ఓ పెళ్లిలో వీరిద్దరూ కలుస్తారు. అప్పటికే రేణు వాళ్ళ ఆఫీసులో ఆది (శ్యామ్ మోహన్) అనే వ్యక్తి రేణుని ఇష్టపడుతూ ఉంటాడు. పెళ్లిలో సచిన్ అతని ఫ్రెండు అమూల్ (సంగీత్ ప్రతాప్) కలిసి సరదాగా అల్లరి చేస్తుండడంతో వీళ్ళకి రేణు ఆమె ఫ్రెండ్ దగ్గరవుతారు. రేణు వాళ్ల ఆఫీస్ బ్యాచ్ వేరే ప్లాన్ పెట్టుకోవడంతో రేణు ఆమె ఫ్రెండ్ కార్తిక.. సచిన్ వాళ్ళ కారులో హైదరాబాద్ కి వస్తారు. పెళ్లి నుంచి హైదరాబాద్ ప్రయాణంలో నలుగురు క్లోజ్ అవుతారు. అప్పటినుంచి ఆది సచిన్ పై కోపం పెంచుకుంటాడు. రేణుని మొదటిసారి చూడగానే ప్రేమలో పడిపోయిన సచిన్ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న ఆలోచనని వదిలేసి అక్కడే ఓ రెస్టారెంట్ లో జాబ్ చేస్తూ ఉంటాడు.

ఆ తర్వాత ఫ్రెండ్స్ గా వీరి ప్రయాణం ఎలా సాగింది? సచిన్ రేణుకి తన ప్రేమని చెప్పాడా? రేణు ఏమంది? ఆది కూడా రేణుకి తన ప్రేమను చెప్పాడా? సచిన్ పై ఆది కోపాన్ని ఎలా చూపించాడు అనేది తెరపై చూడాల్సిందే.

Also read : Gaami Twitter Review : విశ్వక్ సేన్ ‘గామి’ ట్విట్టర్ రివ్యూ ఏంటి..?

సినిమా విశ్లేషణ..
ఇటీవల ఇలాంటి రామ్ కామ్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఇది ఒక మామూలు లవ్ స్టోరీ అయినా దీనికి ఫుల్ లెన్త్ కామెడీని జోడించారు. మలయాళంలో ఆల్రెడీ పెద్ద హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు డబ్బింగ్ తో తెలుగులో రిలీజ్ చేశారు. అయితే ఆ మలయాళం ఫ్లేవర్ కేవలం సినిమాలో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి హీరో హీరోయిన్ కలిసే వరకు కొంచెం స్లోగా సాగుతుంది. ఆ తర్వాత హీరో అతని ఫ్రెండ్ చేసే కామెడీ, హీరో హీరోయిన్స్ మధ్య క్యూట్ సన్నివేశాలు, హీరోయిన్ లవ్ చేసే ఇంకో అబ్బాయి ఆది హీరో పై పెంచుకొనే కోపం, దాన్ని హీరో హీరో ఫ్రెండ్ కామెడీగా డీల్ చేయడం.. అంటూ సాగుతుంది మొదటి 20 నిమిషాలు తప్ప ఆ తర్వాత ఎక్కడ బోర్ కొట్టకుండా సాగుతుంది.

సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా రాసుకున్నారు. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి రామ్ కామ్ సినిమాలు వచ్చి చాలా కాలమైంది అందుకే ఈ సినిమా మలయాళంలో పెద్ద హిట్ అయింది ఇప్పుడు తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ తో మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ హైదరాబాద్ లోనే చేశారు. హైదరాబాద్ ని సినిమాలో చాలా బాగా చూపించారు. సపరేట్ గా ఒక పాట పెట్టి హైదరాబాద్ మొత్తం తిప్పి చూపించారు.

నటీనటుల విషయానికొస్తే..
సచిన్ పాత్రలో అమాయకుడిగా కామెడీ పండిస్తూ నస్లెన్ గఫూర్ ఫుల్లుగా నవ్విస్తూనే ఎమోషన్ తో కూడా మెప్పించాడు. రేణు పాత్రలో మమిత బిజు క్యూట్ గా కనిపించి మెప్పించింది. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. ఆది పాత్రలో శ్యామ్ మోహన్ కామెడీ విలన్ గా అలరించాడు. హీరో ఫ్రెండ్ అమూల్ డేవిస్ పాత్రలో సంగీత్ ప్రతాప్ ఫుల్లుగా నవ్వించాడు. మిగిలిన పాత్రలలో నటీనటులు అద్భుతంగా నటించారు.

Also read : Kalki 2898 AD : ఇటలీ షూటింగ్ సెట్స్ నుంచి.. ప్రభాస్, దిశా పటాని ఫొటో వచ్చేసింది..

సాంకేతిక విషయాలు..
సినిమా రామ్ కామ్ కావడంతో దానికి తగ్గట్టు మంచి ఫీల్ గుడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. మలయాళం డబ్బింగ్ వర్షన్ కాబట్టి పాటలు మాత్రం పరవాలేదు అనిపిస్తాయి. డబ్బింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ తెలుగులో ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. డైలాగ్స్ తో సినిమా అంతా ఫుల్ గా నవ్వించారు. కథ, కథనం కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా బోర్ కొట్టకుండా సాగుతుంది. దర్శకుడిగా గిరీష్ ఒక మంచి లవ్ కామెడీ సినిమాని ప్రేక్షకులకు అందించాడు. ఈ సినిమాని పుష్ప విలన్ ఫహద్ ఫజిల్, అతని ఫ్రెండ్స్ కలిసి నిర్మించారు. చిన్న సినిమా అయినా నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు. సినిమాలో హైదరాబాద్, చెన్నై, సేలం, కేరళలోని కొన్ని ప్రదేశాలు చాలా బాగా చూపించారు.

మొత్తంగా ‘ప్రేమలు’ సినిమా ఒక మంచి లవ్ కామెడీ జోనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. హ్యాపీగా థియేటర్ కి వెళ్లి ఫుల్ గా నవ్వుకొని ఒక మంచి లవ్ స్టోరీ చూడాలనుకుంటే కచ్చితంగా ప్రేమలు సినిమాకి వెళ్లాల్సిందే. ఈ సినిమాకు రేటింగ్ 3.5 ఇవ్వచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు