ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత..
Director Siddique : సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు మొన్న బాలీవుడ్ లో ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్, ఇటీవల టాలీవుడ్ ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూయడం అందర్నీ ఎంతో బాధకి గురి చేసింది. ఇప్పుడు మలయాళ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ ‘సిద్ధిక్’ నేడు ఆగష్టు 8న కోచిలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో మలయాళ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతుంది. సినీ ప్రేక్షకులు, ప్రముఖులు ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు.
Satya Teaser : సాయి ధరమ్ తేజ్ ఫీచర్ ఫిలిం ప్రోమో రిలీజ్.. ఆగష్టు 15న విడుదల..!
దర్శకుడు సిద్ధిక్ కి సోమవారం (ఆగష్టు 7) నాడు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అనూహ్యంగా గుండెపోటు నాడు గుండెపోటు రావడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ అడ్మిట్ అయిన ఆయనకు ఎక్మో సపోర్టులో ట్రీట్మెంట్ అందిస్తూ వచ్చారు. ఆయన పరిస్థితి తెలుసుకున్న నటుడు లాల్, నటుడు సిద్దిక్, దర్శకుడు బి ఉన్నికృష్ణన్, రెహమాన్, ఎంజి శ్రీకుమార్ ఆసుపత్రికి వచ్చి ఆయనను చూసి వెళ్లారు.
Chiranjeevi : చిరంజీవి కామెంట్స్ పై వైసీపీ నాయకులు రియాక్షన్.. గిల్లినప్పుడు.. గిల్లించుకోవాలి..
Just IN: Director Siddique dies due to heart attack.#RIPSiddique pic.twitter.com/1Jv72OzHIJ
— Manobala Vijayabalan (@ManobalaV) August 8, 2023
కాగా మలయాళంలో స్టార్ హీరోలతో సినిమా చేసిన సిద్ధిక్.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా పలు సినిమాలు డైరెక్ట్ చేశారు. తెలుగులో హీరో నితిన్ తో 2005 లో ‘మారో’ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. అలాగే బాలీవుడ్ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ‘బాడీగార్డ్’ వంటి సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించారు. రచయితగా కెరీర్ మొదలుపెట్టిన సిద్ధిక్.. దర్శకుడిగా, నటుడిగా, నిర్మతగా, టెలివిజన్ లో హోస్ట్ గా కూడా అలరించారు. చివరిగా 2020 లో మోహన్ లాల్ తో బిగ్ బ్రదర్ అనే సినిమాని తెరకెక్కించారు.