Satya Teaser : సాయి ధరమ్ తేజ్ ఫీచర్ ఫిలిం ప్రోమో రిలీజ్.. ఆగష్టు 15న విడుదల..!

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మరో మూవీతో వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. అయితే ఈసారి..

Satya Teaser : సాయి ధరమ్ తేజ్ ఫీచర్ ఫిలిం ప్రోమో రిలీజ్.. ఆగష్టు 15న విడుదల..!

Sai Dharam Tej Swathi Reddy short feature film Satya Teaser release

Updated On : August 15, 2023 / 9:33 AM IST

Satya Teaser : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. ఏప్రిల్ లో విరూపాక్ష (Virupaksha) తో భయపెట్టిన తేజ్.. జులైలో బ్రో (Bro) మూవీలో మావయ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి సందడి చేశాడు. ఇప్పుడు మరో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. అయితే ఇది రెండు గంటలనర సినిమా కాదండోయ్. కేవలం 23 నిముషాలు పాటు ఉండే ఒక చిన్న సినిమా.

Bholaa Shankar : పవన్‌తో మొదలైన భోళా శంకర్ రీమేక్ చిరుతో పూర్తి అయ్యింది.. ఆ విషయం తెలుసా..?

దేశభక్తి, దేశం కోసం ఫైట్ చేసే సైనికులు గురించి సాయి ధరమ్ తేజ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక షార్ట్ ఫీచర్ ఫిలిం చేశాడు. ఆ సినిమాలో సాయి ధరమ్ ఒక సోల్జర్ గా కనిపించబోతున్నాడు. ఇక అతని భార్యగా తన కాలేజీ ఫ్రెండ్, టాలీవుడ్ యాక్ట్రెస్ కలర్ స్వాతి (Swathi Reddy) నటించింది. ఈ మూవీ నుంచి అప్పటిలో ఒక పోస్టర్ కూడా బయటకి వచ్చి వైరల్ అయ్యింది. ఈ సంవత్సరం ఇండిపెండెన్స్ సందర్భంగా ఆగష్టు 15న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ మూవీ నుంచి ఇప్పుడు ఒక చిన్న ప్రోమో టీజర్ ని రిలీజ్ చేశారు. ఒకసారి ఆ టీజర్ ని మీరు కూడా చూసేయండి.

Chiranjeevi : చిరంజీవి కామెంట్స్ పై వైసీపీ నాయకులు రియాక్షన్.. గిల్లినప్పుడు.. గిల్లించుకోవాలి..

కాగా ఈ సినిమాని సాయి ధరమ్ తేజ్ స్నేహితుడు హర్షిత్ నిర్మించగా మరో మిత్రుడు నవీన్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. 23 నిముషాలు పాటు ఉండే ఈ ఫిలింలో ఒక 6 నిముషాలు సాంగ్ కూడా ఉంటుంది. ప్రముఖ సింగర్ శృతి రంజని ఈ సినిమాకి సంగీతం అందించింది. దేశసరిహద్దుల్లో దేశం కోసం ప్రాణం ఇచ్చే సైనికుల మాత్రమే కాదు, వారి భార్యలు కూడా తమ భర్తలని దేశం కోసం పంపించి ఎటువంటి త్యాగం చేస్తున్నారు అనే దాని పై ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించారు.