Bholaa Shankar : పవన్‌తో మొదలైన భోళా శంకర్ రీమేక్ చిరుతో పూర్తి అయ్యింది.. ఆ విషయం తెలుసా..?
భోళా శంకర్ రీమేక్ పవన్ కళ్యాణ్ తో మొదలయిన విషయం మీలో ఎంతమందికి తెలుసు..? అది చిరంజీవి చెంతకి ఎలా వచ్చింది..?

Chiranjeevi Bholaa Shankar remake is first opened with Pawan Kalyan
Bholaa Shankar : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న మూవీ ‘భోళా శంకర్’. AK ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తుంది. అయితే ఈ రీమేక్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చెయ్యాల్సింది. ప్రస్తుతం పవన్ తో ‘హరిహరవీరమల్లు’ సినిమాని నిర్మిస్తున్న ఏ ఎం రత్నం.. వేదాళం తెలుగు రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.
Alia Bhatt : ఇంగ్లీష్ నటికి తెలుగు నేర్పిస్తున్న హిందీ నటి.. మీకు నా ముద్దులు.. వీడియో వైరల్
తమిళ్ దర్శకుడు ‘RT నీసన్’ ఆ రీమేక్ ని డైరెక్ట్ చేయాల్సింది. పవన్ చేతులు మీదుగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ఓపెన్ కూడా అయ్యింది. కానీ ఏమైందో తెలియదు, ఆ సినిమా ఆగిపోయింది. ఆ తరువాత ఆ రీమేక్ రైట్స్ ని అనిల్ సుంకర తీసుకోని చిరంజీవి వద్దకి రావడంతో భోళా శంకర్ సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ రీమేక్ చేయడానికి చిరంజీవి కూడా మొదటి అంగీకరించలేదు. ఎందుకంటే అంతకుముందు చేసిన ‘గాడ్‌ఫాదర్’ రీమేక్ పెద్దగా వర్క్ అవుట్ లేదు. దీంతో మళ్ళీ రీమేక్స్ జోలికి వెళ్లకూడదని చిరు అనుకున్నాడు.

Chiranjeevi Bholaa Shankar remake is first opened with Pawan Kalyan
Chiranjeevi : చిరంజీవి కామెంట్స్ పై వైసీపీ నాయకులు రియాక్షన్.. గిల్లినప్పుడు.. గిల్లించుకోవాలి..
అయితే గాడ్‌ఫాదర్ విషయంలో ఒరిజినల్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు డబ్బింగ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేయడంతోనే ఆలా జరిగిందని, వేదాళం తెలుగు ఆడియన్స్ కి ఎక్కడ అందుబాటులో లేదు. కాబట్టి భోళాశంకర్ రీమేక్ వర్క్ అవుట్ అవుతుందని ఒప్పించాడు. కాగా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh), అక్కినేని హీరో సుశాంత్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 11న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.