Alia Bhatt : ఇంగ్లీష్ న‌టికి తెలుగు నేర్పిస్తున్న హిందీ న‌టి.. మీకు నా ముద్దులు.. వీడియో వైర‌ల్‌

వార‌స‌త్వంగా సినీప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టినా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్‌(Alia Bhatt). విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ద్వారా అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ద‌గ్గ‌రైంది.

Alia Bhatt : ఇంగ్లీష్ న‌టికి తెలుగు నేర్పిస్తున్న హిందీ న‌టి.. మీకు నా ముద్దులు.. వీడియో వైర‌ల్‌

Alia Bhatt teaches Telugu

Updated On : August 8, 2023 / 6:07 PM IST

Alia Bhatt teaches Telugu : వార‌స‌త్వంగా సినీప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టినా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్‌(Alia Bhatt). విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా ద్వారా అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ద‌గ్గ‌రైంది. ప్ర‌స్తుతం అలియా హాలీవుడ్‌(Hollywood)లో స‌త్తా చాటేందుకు సిద్ద‌మైంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్ (Heart of Stone) అనే చిత్రంతో హాలీవుడ్‌లో తెరంగ్రేటం చేయ‌నుంది.

ఈ సినిమాలో హాలీవుడ్‌ నటులు గాల్ గాడోట్(Gal Gadot), జామీ డోర్నన్‌(Jamie Dornan)లతో తెరను పంచుకుంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అలియా ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టిస్తోంది. ఆగ‌స్టు 11న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌ముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో ఇంగ్లీష్‌, తెలుగుతో పాటు ఇత‌ర భార‌తీయ‌ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర‌బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

Rocky Aur Rani Kii Prem Kahaani : బాలీవుడ్‌లో మరో 100 కోట్ల సినిమా.. హిందీ పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయా..?

ప్రమోషన్స్‌లో భాగంగా అలియా భట్‌ తన సహనటులు గాల్‌ గడోట్, జేమీ డోర్నన్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో హాలీవుడ్ న‌టి గాల్‌కు తెలుగులో కొన్ని ప‌దాల‌ను నేర్పించింది. ‘అందరికీ నమస్కారం.. మీకు నా ముద్దులు’ అని అలియా చెప్ప‌గా గాల్ గ‌డోట్ కూడా చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

కాగా.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ స‌మ‌యంలో అలియా భ‌ట్ తెలుగులో కొన్ని ప‌దాల‌ను నేర్చుకున్న సంగ‌తి తెలిసిందే.

Jailer Release : గ‌ట్లుంట‌దీ సూప‌ర్‌స్టార్ క్రేజ్ అంటే.. ‘జైలర్‌’ రిలీజ్‌ రోజు బెంగళూరు, చెన్నై ఆఫీసుల‌కు సెలవు, ఫ్రీగా టికెట్లు..