Malayala super hit movie Manjummel Boys Trailer released
Manjummel Boys Trailer : ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను డబ్ చేసి తెలుగులోకి కూడా తీసుకు రావడం ఆనవాయితీగా మారిపోయింది. 2018, ప్రేమలు సినిమాలు తెలుగులో రిలీజయ్యి సూపర్ హిట్స్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా మలయాళంలో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ అయిన సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’. ఫిబ్రవరి 22న మలయాళంలో రిలీజయిన ఈ చిత్రం న్యూ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.
కేవలం 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి అదుర్స్ అనిపించింది. ఇక ఈ సినిమా ఇంతటి విజయం సాదించడడంతో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగులో ఏప్రిల్ 6న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. దీంతో నేడు ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సౌబిన్ సాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు.. పలువురు మలయాళ యువ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొంతమంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ట్రిప్ కి వెళ్లగా, అక్కడ ఓ గుహలోకి ప్రవేశం లేకపోయినా వెళ్తారు. ఆ గుహ లోపల ఓ లోయలో ఒక ఫ్రెండ్ పడిపోతే మిగిలిన వాళ్లంతా అతన్ని ఎలా బయటకు తీశారు అనే థ్రిల్లర్, ఫ్రెండ్షిప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.