Fahadh Faasil : ఆ వ్యాధితో బాధపడుతున్న పుష్ప నటుడు.. 41 ఏళ్ళ వయసులో..

తాజాగా ఫహాద్ ఫాజిల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఓ వ్యాధి ఉన్నట్టు చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.

Malayalam Actor Fahadh Faasil reveals he Has ADHD Disease found at age 41

Fahadh Faasil : మలయాళ సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్ తెలుగులో పుష్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందర్నీ మెప్పించాడు. ఫహాద్ ఫాజిల్ మలయాళ సినిమాలు ఓటీటీ ద్వారా ఇక్కడ కూడా బాగానే ఆడాయి. తెలుగులో కూడా అతనికి అభిమానులు ఉన్నారు. త్వరలో పుష్ప 2 సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫహాద్ ఫాజిల్ ఇటీవలే ఆవేశం అనే సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. కేవలం మలయాళం భాషలోనే రిలీజయి ఏకంగా 150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఆ సినిమా.

తాజాగా ఫహాద్ ఫాజిల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఓ వ్యాధి ఉన్నట్టు చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ.. నాకు అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌ (ADHD) అనే వ్యాధి వచ్చింది. 41 ఏళ్ళ వయసులో నాకు ఈ వ్యాధి వచ్చింది అని తెలిసింది. ఈ వ్యాధి మన మెదడుపై ప్రభావం చూపుతుంది. దేని మీద శ్రద్ద లేకపోవటం, ఓవర్ గా రియాక్ట్ అవ్వడం, ఎక్కువగా ఆవేశపడటం, మతిమరుపు, ఎక్కువగా చిరాకు పడటం.. లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఇది సాధారణమైందే. టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పెద్దల్లో చాలా అరుదుగా వస్తుంటుంది. ప్రస్తుతం దీని చికిత్స కోసం వైద్యులను సంప్రదిస్తున్నాను అని తెలిపాడు.

Also Read : Bachhala Malli first look : అల్ల‌రి న‌రేష్ ‘బ‌చ్చ‌ల మ‌ల్లి’ ఫ‌స్ట్ లుక్‌.. పేరు మ‌ల్లి, ఇంటి పేరు బ‌చ్చ‌ల, చేసేది ట్రాక్ట‌ర్ డ్రైవింగ్..

అయితే ఇది అంత భయపడాల్సిన వ్యాధి ఏం కాదు. సాధారణంగా ఎక్కువమందికి ఉండే లక్షణాలే అని ఫహాద్ ఫాజిల్ తెలిపాడు. దీంతో అయన అభిమానులు, పలువురు నెటిజన్లు ఫహాద్ ఫాజిల్ దీని నుంచి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు