Bachhala Malli first look : అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ ఫస్ట్ లుక్.. పేరు మల్లి, ఇంటి పేరు బచ్చల, చేసేది ట్రాక్టర్ డ్రైవింగ్..
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రం 'బచ్చల మల్లి'.

Allari Naresh Bachhala Malli first look Release
Bachhala Malli : టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రం ‘బచ్చల మల్లి’. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అమృత అయ్యర్ కథనాయికగా కనిపించనున్న ఈ సినిమాను హాస్యా మూవీస్ పతాకంపై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ పోస్టర్‌లో రిక్షా పై కూర్చొన్న అల్లరి నరేష్ సిగరేట్ తాగుతూ ఉన్నాడు. వెనక వైపు కనిపిస్తున్న దృశ్యాలను బట్టి ఏదో జాతర జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. పేరు మల్లి, ఇంటి పేరు బచ్చల, చేసేది ట్రాక్టర్ డ్రైవింగ్.. ఈ బచ్చల మల్లి ఖచ్చితంగా చాలా రోజులు గుర్తిండిపోతాడు అంటూ చిత్ర బృందం ఈ పోస్టర్ కింద రాసుకొచ్చింది. మొత్తంగా ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.
Gunasekhar : కొత్త సినిమాను మొదలెట్టిన దర్శకుడు గుణశేఖర్.. మూవీ పేరేంటో తెలుసా..?
అల్లరి నరేష్ కెరీర్‌లో 62వ సినిమా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. . రావు రమేశ్, హరితేజ, ప్రవీణ్ తదితరులు కీలక పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరపుకుంటోంది. 1990వ దశకంలో తుని ప్రాంతంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల స్పూర్తితో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
పేరు – మల్లి ??
ఇంటి పేరు – బచ్చల
చేసేది – ట్రాక్టర్ డ్రైవింగ్ ?ఈ “బచ్చల మల్లి” ఖచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతాడు ❤️?
Presenting you all @allarinaresh in and as #BachhalaMalli ☺️
Shoot in progress. In cinemas soon.@Actor_Amritha @subbucinema @RajeshDanda_ pic.twitter.com/eZ4gfutlvO
— Hasya Movies (@HasyaMovies) May 28, 2024