Gunasekhar : కొత్త సినిమాను మొద‌లెట్టిన ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. మూవీ పేరేంటో తెలుసా..?

టాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కుల్లో గుణ‌శేఖ‌ర్ ఒక‌రు.

Gunasekhar : కొత్త సినిమాను మొద‌లెట్టిన ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. మూవీ పేరేంటో తెలుసా..?

Director Gunasekhar new movie title is Euphoria

Gunasekhar – Euphoria : టాలీవుడ్ టాప్ ద‌ర్శ‌కుల్లో గుణ‌శేఖ‌ర్ ఒక‌రు. చూడాల‌ని వుంది, ఒక్క‌డు, రుద్రమాదేవి వంటి ఎన్నో ఎన్నో గొప్ప చిత్రాల‌ను అందించారు. శాకుంత‌లం సినిమాతో చివ‌రి సారిగా ఆయ‌న ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. హిస్టారికల్ రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ స‌మంత క‌థ‌నాయిక‌. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అల‌రించ‌లేక‌పోయింది.

దీంతో ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా త‌న కొత్త చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశాడు. త‌న సొంత బ్యాన‌ర్ అయిన గుణ టీమ్‌వ‌ర్క్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త‌న కొత్త సినిమాకి ‘యుఫోరియా’ అనే టైటిల్‌ను ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి నీలిమా గుణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

Rashmika Mandanna : బేబీ సినిమా చూసి ఏడ్చేశాను.. బేబీ డైరెక్టర్ పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు..

టైటిల్ మిన‌హా ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో విష‌యాన్ని తెలియ‌జేయ‌లేదు. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాలో న‌టించబోయే న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది.