Thiruvananthapuram
Aparna Nair : ప్రముఖ మళయాళ నటి అపర్ణా నాయర్ అనుమానాస్పద మృతి కేరళలలో సంచలనం కలిగిస్తోంది. తిరునంతపురంలోని తన నివాసంలో ఉరివేసుకుని కనిపించినట్లు పోలీసులు చెబుతున్నారు.
మళయాళ సినీ-సీరియల్ నటి అపర్ణా నాయర్ (33) కన్నుమూసారు. కరమణ సమీపంలోని తన నివాసంలో ఉరి వేసుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అపర్ణ తన భర్త, పిల్లలతో కలిసి ఉంటున్నారు. అపర్ణ పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.
Anand Kumar: విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్న వేళ.. సూపర్-30 ఆనంద్ కీలక సూచనలు
అపర్ణ మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుటుంబ సమస్యల కారణంగా చనిపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఆమె మరణంతో మళయాళ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. పలువురు నటీనటులు ఆమె మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.