Raviteja : బాలయ్య కాదా..? ఆ సినిమా రీమేక్ చేసేది రవితేజనా..?

ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తారని, బాలకృష్ణ అందులో హీరోగా చేస్తారని వార్తలు వచ్చాయి.

Malayalam Fahadh Faasil Aavesham will Remake in Telugu by Raviteja Rumours goes Viral

Raviteja : వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలు ఇంకో భాషలో రీమేక్ లు చేస్తారని తెలిసిందే. కానీ ఓటీటీలు వచ్చిన తర్వాత రీమేక్ లు వర్కౌట్ అవ్వట్లేదు. అయినా కొంతమంది మంచి సినిమాలు అంటూ వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేస్తున్నారు. మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ ఇటీవల ఆవేశం అనే సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టాడు. అందులో రౌడీ రంగ అనే పాత్రలో ఫహద్ ఫాజిల్ తన నటనతో మెప్పించాడు.

ఆవేశం సినిమా పెద్ద హిట్ అయి ఆల్మోస్ట్ 150 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తారని, బాలకృష్ణ అందులో హీరోగా చేస్తారని వార్తలు వచ్చాయి. ఆల్రెడీ ఓ నిర్మాణ సంస్థ ఆవేశం రీమేక్ రైట్స్ కూడా కొనుక్కుందట. అయితే తాజాగా ఆ సినిమా బాలయ్య చేయట్లేదని, రవితేజ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : Sai Pallavi : క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్.. సాయి పల్లవి స్పీచ్.. తండేల్ ప్రెస్ మీట్ లో ఏమని మాట్లాడిందంటే..

ఆవేశం సినిమాలో ఫహద్ కామెడీ గ్యాంగ్ స్టర్ గా కనిపించి అదరగొట్టాడు. మరి ఆ పాత్ర రవితేజ చేస్తాడా? నిజంగానే రవితేజ ఆవేశం సినిమా రీమేక్ లో నటిస్తాడా అంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే. ఇక రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాతో బిజీగా ఉన్నాడు.