Sai Pallavi : క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్.. సాయి పల్లవి స్పీచ్.. తండేల్ ప్రెస్ మీట్ లో ఏమని మాట్లాడిందంటే..

అమరన్ సక్సెస్ తర్వాత సాయి పల్లవి మొదటిసారి ఇలా పబ్లిక్ ఈవెంట్లో మాట్లాడింది సాయి పల్లవి.

Sai Pallavi : క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్.. సాయి పల్లవి స్పీచ్.. తండేల్ ప్రెస్ మీట్ లో ఏమని మాట్లాడిందంటే..

Sai Pallavi Speech in Thandel Release Date Announce Press Meet after Amaran Success

Updated On : November 5, 2024 / 5:02 PM IST

Sai Pallavi : సాయి పల్లవి ఇటీవలే అమరన్ సినిమాతో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది. ప్రేక్షకులను కంటతడి పెట్టించింది తన నటనతో. ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య సరసన తండేల్ సినిమా చేస్తుంది. తాజాగా నేది తండేల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.

Also Read : Allu Aravind : సాయి పల్లవిని నా కూతురులా చూస్తాను.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

అమరన్ సక్సెస్ తర్వాత సాయి పల్లవి మొదటిసారి ఇలా పబ్లిక్ ఈవెంట్లో మాట్లాడింది. తండేల్ డేట్ అనౌన్స్ ఈవెంట్లో సాయి పల్లవి మాట్లాడుతూ.. అమరన్ కి తెలుగు పీపుల్ పెద్ద సక్సెస్ ఇచ్చారు. చాలా థ్యాంక్యు. గీత ఆర్ట్స్, అల్లు అరవింద్ గారు నేను ఎప్పుడు ఏం సాధించినా, ఏ స్పెషల్ అకేషన్ లో అయినా నాకు కాల్ చేసి స్పెషల్ ఫీల్ అయ్యేలా చేస్తారు. నన్ను వాళ్ళ కూతురిలా చూసుకుంటారు. తండేల్ చిన్న సినిమాగా మొదలయి చాలా పెద్దగా అయింది. రియల్ లైఫ్ కథతో చేస్తున్నాము కాబట్టి దానికి తగ్గట్టు చాలా ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి చేసాము. ఈ ఈవెంట్ ని కూడా ఇంత పెద్దగా చేస్తారని అసలు ఊహించలేదు అని తెలిపింది.

ఇక ఈ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఇటీవల నాకు ఒకరు సాయి పల్లవి గురించి ఓ మాట చెప్పారు. క్వీన్ ఆఫ్ బాక్సాఫీసెస్ అని అన్నారు అని తెలిపారు. ఇన్నాళ్లు లేడీ పవర్ స్టార్ అని సాయి పల్లవిని పిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ వాసు ఇది చెప్పడంతో ఈ ఈవెంట్లోనే క్వీన్ ఆఫ్ బాక్సాఫీసెస్ అని పిలవడం గమనార్హం.