2018 Movie : మరో మలయాళ సినిమా సంచలనం.. ఒక్క భాషలోనే 100 కోట్లు..

తాజాగా మలయాళంలో వచ్చిన ఓ సినిమా సంచలనం సృష్టిస్తుంది. జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ దర్శకత్వంలో టోవినో థామస్, అపర్ణ బాలమురళి, తన్వి రామ్.. పలువురు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన సినిమా '2018'. కేవలం 15 కోట్లతో తెరకెక్కించిన ఈ మలయాళం సినిమా 10 రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

Malayalam Movie : ఇటీవల మలయాళంలో మంచి మంచి సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. వేరే భాషల వాళ్ళు మలయాళ సినిమాలు చూసి మెచ్చుకుంటున్నారు. చాలా తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి సినిమాలు ఎలా తీస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. ఇక పలు కేరళ సినిమాల రీమేక్ రైట్స్ తీసుకొని వేరే పరిశ్రమలు అక్కడ రీమేక్ చేస్తున్నాయి. అయితే మలయాళ సినిమాలకు ఎన్ని అభినందనలు వచ్చినా కలెక్షన్స్ మాత్రం రావట్లేదు. ఇప్పటిదాకా కేరళలో 100 కోట్లు వచ్చిన సినిమాలు చేతి వేళ్ళపై లెక్కపెట్టొచ్చు.

తాజాగా మలయాళంలో వచ్చిన ఓ సినిమా సంచలనం సృష్టిస్తుంది. జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ దర్శకత్వంలో టోవినో థామస్, అపర్ణ బాలమురళి, తన్వి రామ్.. పలువురు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘2018’. కేవలం 15 కోట్లతో తెరకెక్కించిన ఈ మలయాళం సినిమా 10 రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ‘2018’ సినిమా పాన్ ఇండియా కూడా రిలిజ్ చేయలేదు. కేవలం మలయాళం ఒక్క భాషలోనే రిలీజ్ చేశారు. మళయాళంలో ఇప్పటివరకు 100 కోట్లు సాధించిన మలయాళ సినిమాలు లూసిఫర్, కురుప్.. ఇలా చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఫుల్ రన్ లో 100 కోట్లు సాధించాయి. కాని ‘2018’ సినిమా మాత్రం కేవలం 10 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా రన్ అవుతుంది. ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక చిన్న మలయాళ సినిమా ఇప్పుడు కేరళలో సంచలనం సష్టించి ఇండియా వైడ్ ఆసక్తిని పెంచింది.

Tharun : తరుణ్ పెళ్లి పై తల్లి రోజా రమణి వ్యాఖ్యలు.. ఆ రూమర్స్ చూసినప్పుడు బాధపడ్డాను..

అసలు ‘2018’ కథే ఏంటంటే.. 2018 సంవత్సరంలో కేరళలో వరదలు వచ్చి చాలా నష్టం చేకూరింది. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు, కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. రియల్ గా జరిగిన ఈ సంఘటనలను తీసుకొని సర్వైవల్‌ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ వరదలు వచ్చినప్పుడు సామాన్య మానవులు హీరోలుగా మారి తమని తాము రక్షించుకుంటూనే, తోచినంతమందికి ఎలా సాయం చేశారు అనే కథాంశంతో తెరకేకించారు. కేవలం వరదలు మీద మాత్రం కాక అంతర్లీనంగా ప్రేమ, గొడవలు, త్యాగాలు.. ఇలా ఒక్కో క్యారెక్టర్ కి ఇంకో కథ పెట్టి దాన్ని కూడా అందంగా చూపించారు. ప్రస్తుతం ఈ ‘2018’ సినిమా దేశవ్యాప్తంగా చర్చగా మారింది. త్వరలోనే వేరే భాషల్లో డబ్బింగ్ తో రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు