Tharun : తరుణ్ పెళ్లి పై తల్లి రోజా రమణి వ్యాఖ్యలు.. ఆ రూమర్స్ చూసినప్పుడు బాధపడ్డాను..

తాజాగా రోజా రమణి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో గతంలో తరుణ్ పై వచ్చిన రూమర్స్ గురించి, తరుణ్ పెళ్లి గురించి కూడా మాట్లాడింది.

Tharun : తరుణ్ పెళ్లి పై తల్లి రోజా రమణి వ్యాఖ్యలు.. ఆ రూమర్స్ చూసినప్పుడు బాధపడ్డాను..

Roja Ramani comments on Tharun Marriage

Roja Ramani : చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలతో మెప్పించిన తరుణ్(Tharun) నువ్వేకావాలి(Nuvve Kavali)తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అనంతరం మంచి మంచి హిట్ సినిమాలు అందించాడు. కొంతకాలం వరుస పరాజయాలు రావడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. 2018 లో చివరిసారిగా ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా కూడా పరాజయం పాలైంది. ఒకప్పుడు స్టార్ హీరోగా ఎదిగి లవర్ బాయ్ అనిపించుకున్న తరుణ్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్, సినిమా క్రికెట్ లో మాత్రం కనిపిస్తున్నాడు.

ఇక తరుణ్ తల్లి రోజా రమణి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి అనంతరం నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కూడా ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉన్నా సినిమా కార్యక్రమాల్లో మాత్రం రెగ్యులర్ గా కనిపిస్తున్నారు. తాజాగా రోజా రమణి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో గతంలో తరుణ్ పై వచ్చిన రూమర్స్ గురించి, తరుణ్ పెళ్లి గురించి కూడా మాట్లాడింది.

గతంలో తరుణ్ – ఆర్తి అగర్వాల్, తరుణ్ – ప్రియమణి రిలేషన్ లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. తాజాగా వీటి గురించి రోజా రమణి మాట్లాడుతూ.. కొంతమంది ఎలాంటి ఆధారం లేకుండా రూమర్స్ రాస్తారు. అవి చూసినప్పుడు బాధేస్తుంది. ఎందుకిలా రాస్తారనిపిస్తుంది. కానీ ఆ తర్వాత అబద్ధపు ప్రచారాల గురించి మనమెందుకు బాధపడాలి అని అలాంటి వార్తలను పట్టించుకోవడం మానేశాను. ప్రస్తుతం అభిమానులు, ప్రేక్షకుల ఆశీర్వాదం వల్ల మేమంతా బాగున్నాము అని తెలిపారు.

Vijay Antony : బిచ్చగాడు మహేష్ బాబుకి సూట్ అవుతుంది.. విజయ్ ఆంటోని వ్యాఖ్యలు వైరల్.. మహేష్ అభిమానులు ఏమన్నారో తెలుసా?

ఇక తరుణ్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. నాకు ప్రస్తుతానికి కోరికలేమి లేవు. తరుణ్ పెళ్లి ఒక్కటైతే చాలు. అంతకు మించి ఎలాంటి కోరికలు లేవు. అది సమయం వచ్చినప్పుడు కచ్చితంగా అవుతుంది. లేట్ అయినా తరుణ్ పెళ్లి అవుతుంది అని అన్నారు రోజా రమణి.