Marco : మలయాళం మోస్ట్ వైలెంట్ సినిమా మార్కో.. తెలుగు డబ్బింగ్.. ఆహా ఓటీటీలో ఎప్పటినుంచంటే..?

ఇప్పుడు మార్కో సినిమా తెలుగు డబ్బింగ్ ఆహా ఓటీటీలోకి వచ్చేస్తుంది.

Malayalam Star Unni Mukundan Marco Movie Telugu Dubbing OTT Releasing Details

Marco Movie : మలయాళం స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మార్కో’. మలయాళంలో మోస్ట్ వైలెంట్ సినిమాగా గత సంవత్సరం డిసెంబర్ 20న రిలీజయి మంచి విజయం సాధించింది. మలయాళంలో ఈ రేంజ్ వైలెన్స్ ఇప్పటివరకు ఏ సినిమాలో చూపించకపోవడంతో మంచి రీచ్ వచ్చింది.

Also Read : Samantha : సమంత లేటెస్ట్ ఫోటోలు చూశారా? డిజైన్ స్కర్ట్ లో..

మార్కో సినిమాని తెలుగులో జనవరి 1న రిలీజ్ చేయగా ఇక్కడ కూడా పర్వాలేదనిపించింది. షరీఫ్ మొహమ్మద్ నిర్మాణంలో హనీఫ్ అదేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యుక్తి తరేజా, కబీర్ సింగ్, సిద్దిఖ్, జగదీశ్, ఇషాన్.. పలువురు మలయాళం స్టార్స్ ముఖ్య పాత్రల్లో ఈ సినిమాలో నటించారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఆహా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ నెల 21వ తేదీ నుంచి మార్కో సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read : Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’.. ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడు? ఏ ఓటీటీలో?

ఓవర్సీస్ లో ఆహా ఓటీటీలో ఈ నెల 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ఇందులో మనుషులను చంపే కొన్ని వైలెంట్ సీన్స్ చూడాలంటే ధైర్యం కావాల్సిందే. అలాంటి ధైర్యం మీకు ఉంటే మలయాళం మోస్ట్ వైలెంట్ సినిమా మార్కోని తెలుగులో ఆహా ఓటీటీలో ఫిబ్రవరి 21 నుంచి చూసేయండి.