Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’.. ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడు? ఏ ఓటీటీలో?
డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా గత నెల జనవరి 12న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది.

Balakrishna Daaku Maharaaj Movie Releasing in OTT Details Here
Daaku Maharaaj : బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, సచిన్ ఖేద్కర్, చాందిని చౌదరి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా గత నెల జనవరి 12న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఆల్మోస్ట్ 170 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాలయ్యకు వరుసగా నాలుగో హిట్ ఇచ్చింది. థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించిన దాకు మహారాజ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. బాలయ్య డాకు మహారాజ్ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.
నెట్ ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. థియేటర్స్ లో బాలయ్య మాస పర్ఫార్మెన్స్ మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో చూసేయండి. డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ మూడు వేరియేషన్స్ లో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఒక మంచి మెసేజ్ తో పాటు మాస్ ఎమోషనల్ గా తెరక్కించారు ఈ సినిమాని. ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు.
Anagananaga oka raju.. cheddavalu andharu Daaku anevaalu… kaani maaku mathram Maharaaju!
Watch Daaku Maharaaj, out on 21 Feb on Netflix! #DaakuMaharaajOnNetflix pic.twitter.com/xkljLJmQeJ
— Netflix India South (@Netflix_INSouth) February 16, 2025
Also Read : Krishnaveni : ఎన్టీఆర్ ని నటుడిగా పరిచయం చేసిన నటి, నిర్మాత కన్నుమూత.. అప్పట్లోనే ప్రేమ వివాహం..