Daali Dhananjaya : పెళ్లి చేసుకోబోతున్న పుష్ప విలన్.. పెళ్లికూతురు ఎవరో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా పెళ్లి పిలుపు..

ఈ కన్నడ స్టార్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు.

Daali Dhananjaya : పెళ్లి చేసుకోబోతున్న పుష్ప విలన్.. పెళ్లికూతురు ఎవరో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా పెళ్లి పిలుపు..

Kannada Star Daali Dhananjaya Getting Married Date Venue Bride Details here

Updated On : February 16, 2025 / 5:32 PM IST

Daali Dhananjaya : పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్రలో నెగిటివ్ రోల్ లో మెప్పించాడు కన్నడ స్టార్ డాలి ధనంజయ. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కన్నడలో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు డాలి ధనంజయ. తెలుగులో పుష్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సత్యదేవ్ జీబ్రా సినిమాలో కూడా అలరించాడు. ఈ కన్నడ స్టార్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆల్రెడీ గత సంవత్సరం నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Also Read : Trikala : ‘త్రికాల’ ట్రైలర్ చూశారా? త్రికాల సినిమాటిక్ యూనివర్స్..

ప్రముఖ డాక్టర్, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ ధన్యతని ధనంజయ వివాహం చేసుకోబోతున్నాడు. ధనంజయ – ధన్యతల వివాహం నేడు ఫిబ్రవరి 16న మైసూరులో జరగనుంది. నిన్న ఫిబ్రవరి 15 సాయంత్రం రిసెప్షన్ నిర్వహించారు . ఇప్పటికే హల్దీ కార్యక్రమం, మరిన్ని పెళ్లి పనులు ఆల్రెడీ పూర్తయ్యాయి.

 

View this post on Instagram

 

A post shared by Daali Dhananjaya (@dhananjaya_ka)

ధనంజయ పెళ్ళికి కన్నడతో పాటు తెలుగు సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. అయితే ధనంజయ తన పెళ్ళికి ఫ్యాన్స్ ని కూడా అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ఆహ్వానించాడు. నేడు సాయంత్రం జరిగే రిసెప్షన్ కి ఫ్యాన్స్ కూడా హాజరవ్వొచ్చు. ఫ్యాన్స్ కు కూడా భోజనాలు అరేంజ్ చేసినట్టు సమాచారం. దీంతో ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Malayalam Film Industry : మలయాళ ఇండస్ట్రీ మొత్తం బంద్.. డేట్ ప్రకటన.. షూటింగ్ లు, డిస్ట్రిబ్యూషన్, షోలు.. మొత్తం ఖతం..!

ఇప్పటికే ధనంజయ – ధన్యత హల్దీ, పెళ్లి వేడుకలకు సంబంధించి పలు ఫోటోలు బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. మరి వీరి పెళ్ళికి సెలబ్రిటీలు ఎవరెవరు వస్తారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by daali_brothers18 (@daali_brothers18)