Trikala : ‘త్రికాల’ ట్రైలర్ చూశారా? త్రికాల సినిమాటిక్ యూనివర్స్..

మీరు కూడా త్రికాల ట్రైలర్ చూసేయండి..

Trikala : ‘త్రికాల’ ట్రైలర్ చూశారా? త్రికాల సినిమాటిక్ యూనివర్స్..

Shraddha Das Trikala Movie Trailer Released

Updated On : February 16, 2025 / 10:35 AM IST

Trikala : శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘త్రికాల’. రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా ఈ సినిమాని మణి తెల్లగూటి డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా త్రియాలు సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

Also Read : Krishnaveni : ఎన్టీఆర్ ని నటుడిగా పరిచయం చేసిన నటి, నిర్మాత కన్నుమూత.. అప్పట్లోనే ప్రేమ వివాహం..

‘యుద్దం రేపటి వెలుగు కోసం.. కానీ ఈ అంధకాసురిడి యుద్దం వెలుగుని నాశనం చేయడానికి..’ అంటూ తనికెళ్ల భరణి డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, హారర్ ఎఫెక్ట్స్, డివోషనల్ టచ్.. ఇలా అన్ని అంశాలతో ఆసక్తిగా ఉంది ఈ ట్రైలర్. హారర్ థ్రిల్లర్ జానర్లో ప్రేక్షకులను భయపెట్టడానికి ఈ సినిమా రానుంది. ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. మీరు కూడా త్రికాల ట్రైలర్ చూసేయండి..

ఇక ఈ త్రికాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించగా ఈవెంట్లో నటుడు అజయ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ మణి గారు మూడేళ్ల క్రితం త్రికాల కథ చెప్పారు. బడ్జెట్ ఎక్కువ అయ్యేలా ఉంది ఎలా చేస్తారో అనుకున్నా. కానీ సినిమాని పూర్తిచేశారు. ఇప్పటివరకు నాకు ఈ సినిమాకి సంబంధిచి ఏం చూపించలేదు. ఇప్పుడే ట్రైలర్‌ను చూశాను. అద్భుతంగా వచ్చింది అని అన్నారు.

Shraddha Das Trikala Movie Trailer Released

 

మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. ఈ మూవీ కోసం చాలా రీ షూట్ జరిగింది కానీ నిర్మాతలు ప్రశ్నించలేదు, అంతగా సహకరించారు. మణి ఈ మూవీని అద్భుతంగా తీశాడు అని తెలిపారు. డైరెక్టర్ మణి మాట్లాడుతూ.. అజయ్ గారికే ఈ కథను ముందుగా చెప్పాను. వీఎఫ్ఎక్స్ గురించి జాగ్రత్తగా చూసుకో అన్నారు. త్రికాల సినిమాటిక్ యూనివర్స్ గా రానుంది. అంబటి అర్జున్ ఒక్క రోజే షూట్ చేశారు. అదేంటో సినిమాలో తెలుస్తుంది. సాహితి పాత్రను ఎక్కువగా రివీల్ చేయకూడదని అనుకున్నా. మా నిర్మాతలు రాధిక, శ్రీనివాస్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మేం ఈ మూవీ కోసం చాలా వదులుకున్నాం. మా సినిమా సమ్మర్‌లో రాబోతోంది అని తెలిపారు.

Also Read : CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత కాలం ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుంది : సీఎం చంద్రబాబు

నిర్మాత రాధిక, శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని, మన సూపర్ హీరోల్ని అందరికీ చూపించాలని త్రికాల సినిమాను తీశాం. బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్‌లా మన త్రికాల ఉంటుంది. టైంతో సంబంధం లేకుండా కాపాడేవాడే త్రికాల. త్రికాల మూవీకి సీజీ వర్క్ ఎక్కువగా అవసరం అయింది. అందుకే ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది. మన పురాణాల్లోనే హనుమాన్, భీమ్ వంటి సూపర్ హీరోలున్నారు. మనం ఓ ఫిక్షనల్ హీరోని సృష్టించాలని అనుకున్నాం. అలా పుట్టిందే ఈ త్రికాల అని తెలిపారు.