CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత కాలం ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుంది : సీఎం చంద్రబాబు

CM Chandrababu : చంద్రబాబు మాట్లాడుతూ.. సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ను సమర్థవంతంగా నిర్వహించగలరనే నమ్మకం నిరూపితమైందన్నారు.

CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత కాలం ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుంది : సీఎం చంద్రబాబు

Chandrababu About Balakrishna and Bhuvaneshwari

Updated On : February 16, 2025 / 12:01 AM IST

CM Chandrababu : మంచి సమాజం కోసం ఎంతో పరితపించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. బాలకృష్ణ బసవతారకం పేరుతో క్యాన్సర్‌ ఆస్పత్రి ద్వారా భువనేశ్వరి ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా అనేక సేవలందిస్తున్నారని చెప్పారు.

Read Also : Malayalam Film Industry : మలయాళ ఇండస్ట్రీ మొత్తం బంద్.. డేట్ ప్రకటన.. షూటింగ్ లు, డిస్ట్రిబ్యూషన్, షోలు.. మొత్తం ఖతం..!

తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ 28వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యూఫోరియా మ్యూజికల్ నైట్‌’ (Euphoria Musical Night) నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేశ్‌, నారా భువనేశ్వరి సహా పలు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తన సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ను సమర్థవంతంగా నిర్వహించగలరనే నమ్మకం నిరూపితమైందన్నారు.

Read Also : Pawan Kalyan : పవన్ మంచి మనస్సు.. ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ. 50 లక్షలు విరాళం

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ రూ.50లక్షల విరాళం ప్రకటించడం చాలా అభినందనీయమన్నారు. కనీసం రూపాయి పారితోషికం తీసుకోకుండా ఈవెంట్‌ నిర్వహణ కోసం ముందుకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు.