Pawan Kalyan : పవన్ మంచి మనస్సు.. ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ. 50 లక్షలు విరాళం

Pawan Kalyan : తలసేమియా బాధిత పిల్లల సహాయర్థం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు తన వంతు సాయంగా రూ. 50 లక్షలు అందించనున్నట్టు పవన్ ప్రకటించారు.

Pawan Kalyan : పవన్ మంచి మనస్సు.. ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ. 50 లక్షలు విరాళం

Pawan Kalyan Donates Rs 50 Lakhs To NTR Trust

Updated On : February 15, 2025 / 9:13 PM IST

Pawan Kalyan : విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు (ఫిబ్రవరి 15) శనివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో యూఫోరియా మ్యూజికల్ నైట్‌ (Euphoria Musical Night) పేరిట ఈవెంట్‌ నిర్వహించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక పర్యవేక్షణలో ఈవెంట్ నిర్వహించారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ ద్వారా వచ్చే మొత్తాన్ని తలసేమియా బాధితుల చికిత్సకు ఎన్టీఆర్ ట్రస్ట్ వినియోగించనుంది.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్, నారా భువనేశ్వరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Read Also : Balakrishna: చాలా గర్వంగా ఉంది.. చంద్రబాబు, పవన్ కూడా వచ్చారు: బాలకృష్ణ

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. తలసేమియా బాధిత పిల్లలకు సాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. తనలోని దాన గుణాన్ని మరోసారి పవన్ నిరూపించుకున్నారు.

తలసేమియా బాధిత పిల్లల సహాయర్థం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు తన వంతు సాయంగా రూ. 50 లక్షలు అందించనున్నట్టు పవన్ ప్రకటించారు. అంతకుముందు 3 రోజుల ధర్మ పరిరక్షణ యాత్రను ముగిసిన వెంటనే పవన్ తమిళనాడు నుంచి నేరుగా విజయవాడకు చేరుకున్నారు. ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమానికి హాజరయ్యారు. తలసేమియా బాధితుల చికిత్స కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు పవన్ చేరుకున్నారు.