మల్లేశం ఫస్ట్ లుక్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్విట్టర్‌లో మల్లేశం ఫస్ట్ లుక్ షేర్ చేసారు.

  • Publish Date - February 4, 2019 / 05:48 AM IST

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్విట్టర్‌లో మల్లేశం ఫస్ట్ లుక్ షేర్ చేసారు.

అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలను నేసి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచి, చేనేత రంగంలో సంచలనం సృష్టించిన ‘పద్మశ్రీ’ చింతికింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా.. మల్లేశం.. ఎక్స్‌‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ ఏన్ ఆర్డినరీ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్.. పెళ్ళిచూపులు సినిమాలో, నాచావు నేనుచస్తా నీకెందుకు అనే బుక్ రాస్తున్నా అంటూ.. గుర్తింపు తెచ్చుకుని, వరసగా సినిమాలు చేస్తున్న ప్రియదర్శి, మల్లేశంలో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది..

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో మల్లేశం ఫస్ట్ లుక్ షేర్ చేసారు. చదువు మధ్యలోనే ఆపేసి, తన తల్లి లక్ష్మీ పేరుని తన మెషీన్‌కి పెట్టుకుని, అద్భుతమైన చీరలను నేసి, తనచుట్టూ ఉన్నవారి జీవితాలను మార్చి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మల్లేశం.. ఈ సినిమాలో మల్లేశం తల్లి పాత్రలో ఝాన్సీ నటిస్తుంది. మల్లేశం ఫస్ట్ లుక్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి మాటలు : పెద్దింటి అశోక్ కుమార్, లిరిక్స్: గోరేటి వెంకన్న, చంద్రబోస్.. సంగీతం : మార్క్ కె రాబిన్, నిర్మాతలు : రాజ్ ఆర్, శ్రీ అధికారి.. దర్శకత్వం : రాజ్ ఆర్.
వాచ్ ఫస్ట్ లుక్…