×
Ad

Malli Pelli : ఓటీటీలో దూసుకుపోతున్న ‘మ‌ళ్ళీ పెళ్లి’.. 100 మిలియ‌న్ ఫ్ల‌స్..

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్‌(Naresh), ప‌విత్రా లోకేశ్(Pavithra Lokesh) జంట‌గా న‌టించిన సినిమా ‘మళ్ళీ పెళ్లి'(Malli Pelli). జూన్ 23 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

Malli Pelli Movie

Malli Pelli Movie : టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్‌(Naresh), ప‌విత్రా లోకేశ్(Pavithra Lokesh) జంట‌గా న‌టించిన సినిమా ‘మళ్ళీ పెళ్లి'(Malli Pelli). వీరిద్ద‌రి ప‌రిచ‌యం, పెళ్లి విష‌యాల‌నే క‌థ‌గా తీసుకుని సినిమాని తెర‌కెక్కించ‌డంతో విడుద‌ల‌కు ముందే ఎంతో హైప్ క్రియేట్ చేసింది. నిర్మాత‌, డెరెక్ట‌ర్ ఎంఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా మే 26న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే.. ప్రేక్ష‌కులకు అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

దీంతో సినిమా తొంద‌ర‌గానే ఓటీటీలోకి వ‌చ్చేసింది. జూన్ 23 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. ఓటీటీలో మాత్రం ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ వారంలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీల్లో టాప్ 10లో నిలిచింది.

Renu Desai : రేణుదేశాయ్ కాలికి గాయం.. వేలు చితికిపోయిందంటూ పోస్ట్!

Devraj Patel : రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ హాస్య న‌టుడు, యూట్యూబ‌ర్ దుర్మ‌ర‌ణం.. సీఎం సంతాపం

ఇక ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో టాప్‌-2లో నిలిచింది. 100 మిలియ‌న్ ఫ్ల‌స్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతుంది. దీన్ని న‌రేశ్ రీ ట్విట్ చేస్తూ ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

BHAAG SAALE Trailer : తెలంగాణ అంటే కేసీఆర్‌కు ఎంతిష్ట‌మో.. నువ్వంటే అంత ఇష్టం

కాగా.. గ‌త కొంత‌కాలంగా థియేట‌ర్ల‌లో పెద్ద‌గా అల‌రించ‌ని సినిమాలు ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతున్న సంగ‌తి తెలిసిందే.