Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి 2898 AD’లో మాళవిక నాయర్.. ట్రైల‌ర్ చూసేంత వ‌ర‌కు తెలియ‌దుగా..!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం క‌ల్కి 2898 AD.

Malvika Nair role revealed in Prabhas Kalki 2898 AD

Kalki 2898 AD-Malvika Nair : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం ‘క‌ల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో దీపికా ప‌దుకోన్ హీరోయిన్‌. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్, దిశా పటానిలు కీల‌క పాత్రలు పోషించారు. కాగా.. ఈ సినిమాలో మ‌రికొంద‌రు స్టార్ న‌టీన‌టులు అతిథి పాత్ర‌ల్లో న‌టించారు. కాగా.. శుక్ర‌వారం ఈ చిత్ర రిలీజ్ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

ఈ ట్రైల‌ర్‌కు అభిమానుల నుంచి విశేష స్పంద‌న వ‌స్తోంది. అయితే.. ఈ ట్రైల‌ర్ లో హీరోయిన్ మాళ‌విక నాయ‌ర్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వాస్త‌వానికి ఆమె ఈ చిత్రంలో న‌టిస్తున్న‌ట్లుగా ట్రైల‌ర్ విడుద‌ల చేసేంత వ‌ర‌కు ఎవ్వ‌రికి తెలియ‌దు. మహా భారతంలోని ఉత్తర పాత్రలో మాళవిక నటిస్తున్నట్లు ట్రైల‌ర్ బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. అర్జునుడి కొడుకు అభిమ‌న్యు భార్య‌. కురుక్షేత్ర స‌మ‌యంలో అర్జునుడు, అశ్వ‌త్థామ భీక‌ర యుద్ధంలో పాల్గొంటారు. ఇద్ద‌రు కూడా బ్ర‌హ్మాస్రాల‌ను విడిచిపెడ‌తారు.

The GOAT : ద‌ళ‌ప‌తి విజ‌య్ బ‌ర్త్‌డే ట్రీట్‌.. అదిరిపోయిన‌ ‘ది గోట్’​ యాక్షన్ గ్లింప్స్.. నో డైలాగ్స్‌.. ఓన్లీ యాక్ష‌న్‌..

నారదుడు, వ్యాసుడు జోక్యం చేసుకుంటారు. ఇది విశ్వానికి వినాశకరమైనది కాబట్టి వారి ఆయుధాలను ఉపసంహరించుకోవాలని యోధులను కోరారు. అర్జునుడు ఉపసంహరించుకున్నాడు, కానీ అశ్వత్తామ దానిని తిరిగి పొందలేడు. అందుకే.. పాండవులను చంపడంలో విఫలమైనందున అతను ఉద్దేశపూర్వకంగా ఉత్తర గర్భం వద్ద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు.

అభిమన్యుడి బిడ్డను చంపితే పాండవుల వంశాన్ని అంతం చేయగలనని అశ్వత్తామ భావిస్తాడు. శ్రీ కృష్ణ భగవానుడు ఉత్తర శిశువును రక్షించాడు. అశ్వత్తామ గాయాలతో కలకాలం జీవించమని శపిస్తాడు. అందుకే అశ్వత్తామ ఇంకా బతికే ఉన్నాడని నమ్ముతారు. ట్రైలర్‌లో కూడా బ్రహ్మాస్త్రం ఉత్తరపై దాడి చేసే విజువల్స్ చూడొచ్చును.

పవన్ ప్రమాణ స్వీకారం.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్.. ‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’

కాగా.. ట్రైల‌ర్‌లో మాళ‌విక నాయ‌ర్ ఉన్న విజువ‌ల్స్‌ను స్ర్కీన్ షాట్‌ను తీసి అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన మాళ‌విక ఆనందం వ్య‌క్తం చేసింది. వాటిని త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసి అభిమానుల‌కు థ్యాంక్స్ చెప్పింది.