పవన్ ప్రమాణ స్వీకారం.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్.. ‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’

అసెంబ్లీ గ్యాల‌రీలో కూర్చుని కళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం చూసి త‌న మ‌న‌సు ఆనందంతో నిండిపోయిన‌ట్లుగా నాగ‌బాబు చెప్పారు.

పవన్ ప్రమాణ స్వీకారం.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్.. ‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’

Pawan Kalyan Oath As Mla In Ap Assembly nagababu emotional tweet

Nagababu : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ స‌మ‌యంలో త‌న త‌మ్ముడిని చూసి నాగ‌బాబు భావోద్వేగానికి లోన‌య్యారు. అసెంబ్లీ గ్యాల‌రీలో కూర్చుని కళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం చూసి త‌న మ‌న‌సు ఆనందంతో నిండిపోయిన‌ట్లుగా చెప్పారు.

ప‌వ‌న్ అసెంబ్లీకి వెళ్లాలి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అను నేను అని ప్ర‌మాణం స్వీకారం చేయాల‌నేది త‌న క‌ల అని అన్నారు. ప్ర‌తి ఓవ‌ర్ న‌మ్మ‌కాన్ని ప‌వ‌న్ నిల‌బెట్టుకుంటార‌న్నారు. ప‌వ‌న్ నిజాయితీతో, నిష్ప‌క్ష‌పాతంగా అంతఃక‌ర‌ణ శుద్ధితో త‌న మంత్రిత్వ శాఖ‌ల‌కు న్యాయం చేస్తాడ‌ని నాగ‌బాబు చెప్పారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ భావోద్వేగ‌పు పోస్ట్ పెట్టారు.

‘పదేళ్ల కల నెరవేరింది, ప్రజా ప్రస్థానం మొదలైంది.. డిప్యూటీ సీఎం హోదా లో శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. తోడబుట్టిన వాడిగా, జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కి వెళ్లాలి ‘పవన్ కళ్యాణ్ అను నేను’ అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల.. అసెంబ్లీ కి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి I feel very thrill.. మా కుటుంబం అంతా కూటమిలో కళ్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాల చాల సంతోషంగా & గ‌ర్వంగా ఉన్నారు.

Kalki 2898AD : క‌ల్కి మూవీలోని మూడు ప్ర‌పంచాల‌ను చూశారా..? కాంపెక్స్ ఎంత అందంగా ఉందో..!

ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటూ తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయితీతో, నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధి తో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను.’ అని నాగాబాబు ట్వీట్ చేశారు.

Anupam Kher : బాలీవుడ్ స్టార్ న‌టుడు ఆఫీసులో దొంగ‌లు ప‌డ్డారు.. వీడియో షేర్ చేసిన అనుప‌మ్ ఖేర్