Kalki 2898AD : కల్కి మూవీలోని మూడు ప్రపంచాలను చూశారా..? కాంపెక్స్ ఎంత అందంగా ఉందో..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

kalki team introduces the three worlds
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్, ట్రైలర్ లు చూస్తే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని భారీ అంచనాలు నెలకొన్నాయి. లోక నాయకుడు కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్, దీపికా పదుకోన్, దిశా పటాని.. ఇలా స్టార్ నటీనటులు చాలా మంది ఈ సినిమాలో నటిస్తుండగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.
జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ రోజు సాయంత్రం సెకండ్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే తెలిపింది. కాగా.. ఈ మూవీలోని మూడు ప్రపంచాలకు సంబంధించిన పోస్టర్స్‌ను విడుదల చేసింది. “శంభల-ఎదరుచూస్తోంది.. కాంప్టెక్స్- ప్రపంచాన్ని ఆక్రమించింది.. కాశీ-చివరి నగరం.” అంటూ మూడు ప్రపంచాలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేయగా ఇవి వైరల్‌గా మారాయి.
Honeymoon Express : ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూవీ రివ్యూ.. రొమాంటిక్ ఎంటర్టైనర్..
????????: ??????? ??? ????.
6 days to go for #Kalki2898AD, in cinemas worldwide from June 27th!@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth… pic.twitter.com/rAasYVZ5r9
— Kalki 2898 AD (@Kalki2898AD) June 21, 2024
కల్కి కథేంటి అంటే.. మూడు ప్రపంచాల మధ్య ఈ కథ జరుగుతుంది. గంగానది ఒడ్డున ఉన్న పవిత్ర కాశీ నగరం ప్రపంచంలోనే తొలినగరం అని చెప్తారు. అయితే అదే చివరి నగరం కూడా అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో కథ ఉంటుంది. భూమి మీద అన్ని వనరులు అంతరించిపోతాయి. కానీ కాశీలో కాంప్లెక్స్ మనుషులు అని కొంతమంది ప్రత్యేకంగా నిర్మించుకొని ఉంటారు. అక్కడ అన్ని దొరుకుతాయి. సాధారణ ప్రజలు అక్కడికి వెళ్లాలని భావిస్తూ ఉంటారు.
???????: ????????? ??? ?????.
6 days to go for #Kalki2898AD, in cinemas worldwide from June 27th!@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth… pic.twitter.com/f7Kwbe7A9U
— Kalki 2898 AD (@Kalki2898AD) June 21, 2024
కానీ కాంప్లెక్స్ మనుషులు వేరే మనుషులని రానివ్వరు. అక్కడికి వెళ్లాలంటే మిలియన్ యూనిట్స్(డబ్బుల లాంటివి) కావాలి. ఇలా కాంప్లెక్స్ ప్రపంచం, సాధారణ మనుషులు జీవించే కాశీ ప్రపంచంతో పాటు ఇంకో ప్రపంచం శంబాలా ఉంటుంది. పురాణాల ప్రకారం కల్కి ఈ నగరంలోనే పుడతాడు. కాంప్లెక్స్ లో డబ్బున్న మనుషులు, నిర్జీవంగా మారిన కాశీ మనుషులు, శరణార్థులు తల దాచుకునేలా శంబాలా నగరం.. ఇలా ఈ మూడు ప్రపంచాలను కలుపుతూ కథ ఉంటుంది అని నాగ్ అశ్విన్ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.
Anupam Kher : బాలీవుడ్ స్టార్ నటుడు ఆఫీసులో దొంగలు పడ్డారు.. వీడియో షేర్ చేసిన అనుపమ్ ఖేర్
????: ??? ???? ????.
6 days to go for #Kalki2898AD, in cinemas worldwide from June 27th!@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/f6PcjMRTMW
— Kalki 2898 AD (@Kalki2898AD) June 21, 2024