×
Ad

Mamitha Baiju : ‘డ్యూడ్’ హీరోయిన్ కి రామ్ చరణ్ సినిమా అంటే చాలా ఇష్టం అంట.. ఏం సినిమానో తెలుసా?

మమిత బైజు, ప్రదీప్ రంగనాథన్ జంటగా తెరకెక్కిన డ్యూడ్ సినిమా అక్టోబర్ 17న రిలీజయి థియటర్స్ లో నడుస్తుంది. (Mamitha Baiju)

Mamitha Baiju

Mamitha Baiju : మలయాళంలో ఎప్పట్నుంచో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నా ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా సౌత్ మొత్తం వైరల్ అయింది మమిత బైజు. మలయాళం సినిమా ప్రేమలు తెలుగులో కూడా పెద్ద హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇప్పుడు డ్యూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Mamitha Baiju)

మమిత బైజు, ప్రదీప్ రంగనాథన్ జంటగా తెరకెక్కిన డ్యూడ్ సినిమా అక్టోబర్ 17న రిలీజయి థియటర్స్ లో నడుస్తుంది. ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా మమిత బైజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల గురించి ఆసక్తికర విషయం తెలిపింది.

Also Read : VV Vinayak : చులకన చేసి మాట్లాడిన మేనేజర్.. ఆది సినిమా అయిన హిట్ తర్వాత కూడా.. డైరెక్టర్ అయ్యాడని తెలిసి దెబ్బకి..

తెలుగు సినిమాలు చూసేవారా అని అడగ్గా మమిత బైజు మాట్లాడుతూ.. నాకు రామ్ చరణ్ మగధీర సినిమా చాలా ఇష్టం. మలయాళంలో ధీర అని వచ్చింది. ఆ సినిమాని చూసాను. బాగుంటుంది. అలాగే నేను స్కూల్ టైం లో ఉన్నప్పుడు ఆర్య, ఆర్య 2 సినిమాలు చూసాను. అవి కూడా బాగుంటాయి అని తెలిపింది. అయితే రీసెంట్ టైమ్స్ లో చూసిన సినిమాల గురించి చెప్పలేదు మమిత. దీంతో చరణ్ ఫ్యాన్స్ మమిత కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు.