VV Vinayak : చులకన చేసి మాట్లాడిన మేనేజర్.. ఆది సినిమా అయిన హిట్ తర్వాత కూడా.. డైరెక్టర్ అయ్యాడని తెలిసి దెబ్బకి..
డైరెక్టర్ వివి వినాయక్ ని కూడా అలాగే చులకన చూసి మాట్లాడిన సందర్భం, ఆ తర్వాత తాను డైరెక్టర్ అని తెలిసి సైలెంట్ అయిన సంగతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.(VV Vinayak)

VV Vinayak
VV Vinayak : ఇండస్ట్రీలో సక్సెస్ కి ముందు అవమానాలు మాములే. చాలామంది సెలబ్రిటీలు ఒకప్పుడు అవమానాలు, చులకనగా మాట్లాడటం చూసినవాళ్ళే. డైరెక్టర్ వివి వినాయక్ ని కూడా అలాగే చులకన చూసి మాట్లాడిన సందర్భం, ఆ తర్వాత తాను డైరెక్టర్ అని తెలిసి సైలెంట్ అయిన సంగతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.(VV Vinayak)
వివి వినాయక్ మాట్లాడుతూ.. నాగేశ్వర రావు అని ఒక మేనేజర్ ఉన్నారు. గతంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు బాగా తిట్టి వర్క్ చేయించేవాడు. ఆది సినిమా రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమా మొదలుపెట్టాను. ఆ సినిమా సెట్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అది చూడటానికి వెళ్తే ఆ మేనేజర్ అక్కడ కనపడ్డాడు. ఆయన వచ్చి ఏంటి కో డైరెక్టర్ అయిపోయావా అప్పుడే అని సిల్లీగా మాట్లాడాడు.
Also Read : Kajal Aggarwal : చెల్లి పుట్టినరోజు.. క్యూట్ ఫోటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్..
అప్పుడే నిర్మాత త్రివిక్రమ రావు గారు అక్కడికి వచ్చి డైరెక్టర్ గారు నమస్తే అనగానే ఆ మేనేజర్ షాక్ అయ్యాడు. త్రివిక్రమ రావు గారు నాకు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడటం, ఆయన సినిమా సెట్ చూపిస్తూ, కాఫీ తెప్పించి ఇవ్వడంతో మేనేజర్ షాక్ లో ఉన్నాడు. ఆ మేనేజర్ ఆయన సినిమాకు చేస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయాక మేనేజర్ ఏంటి సంగతి అని అడిగాడు. డైరెక్టర్ అయ్యాను అన్నాడు. ఏ సినిమా అంటే..ఆది అని చెప్పాను. వివి వినాయక్ అంటే నువ్వా అని అడిగాడు. అవును నేనే అన్న. అంతే దెబ్బకు సైలెంట్ అయి వెళ్ళిపోయాడు అని చెప్పుకొచ్చారు.
అయితే వివి వినాయక్ అసలు పేరు వినాయక రావు. దాంతో మొదట అందరికి అలాగే తెలుసు. డైరెక్టర్ అవ్వడంతో వినాయక్ అని పేరు మార్చుకున్నారు.
Also Read : K Ramp Review : ‘K ర్యాంప్’ మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం మాస్ ఎంటర్టైన్మెంట్ చూపించాడుగా..